all

Monday, May 13, 2013

పురుషులు తప్పనిసరిగా తీసుకోవల్సిన ఎనర్జిటిక్ ఫుడ్స్..!

ప్రతి రోజూ మనం ఏదో ఒక ఆహారాన్ని తీసుకొంటుంటాం. అయితే ఏఏ ఆహారాలు ఎలా పనిచేస్తాయో, అన్ని విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. ఏం తినాలి? అనే విషయంలో మనకెప్పుడూ సందేహమే. శరీరానికి పోషకాలు అందాలి...అదే సమయం లోబరువు పెరగకూడదు. స్త్రీ, పురుషులు కోరుకునేది ఇదే. మామూలుగానే పురుషులకంటే స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అదనంగా పాటిస్తుంటారు. తినే ఆహారంలో కొన్ని రకాలు మహిళలు పూర్తిగా ఉపయోగపడతాయి.శరీరం ఒకే బరువున్న స్త్రీపురషులు ఒకే రకమైన కొవ్వునిల్వలు కలిగివున్నా, వారు వ్యాయామం ద్వారా ఖర్చుచేసే కేలరీలు కూడా ఒక్కటే అయినా స్త్రీపురుషులకు కాలరీల అవసరం మాత్రం వేరు వేరుగా ఉంటుంది. మగవారిలో కండరాలు పెద్దగా ఉండటం వలన వారు వ్యాయామం చేయకపోయినా కండరాలు యథాస్థితిగా ఉండటానికైనా కేలరీలు అవసరం అవుతాయి.

అందుకే మగవారిలో మహిళలకంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మహిళలు చిన్న పరిమాణంలో ఉండటం వలన కండరాలు కూడా చిన్నగా ఉండటం కారణంగా వారిలో ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. అందుకే స్త్రీలకు పోషకారం అందాలి. అదే సమయంలో తక్కువ కేలరీలు ఉండాలి. సాధారణంగా మహిళలకు రోజుకి 1200కేలరీలు అవసరం అవుతాయి. మగవారికి మరికొన్ని ఎక్కువ కావాలి. మరి పురుషులకు అన్ని క్యాలోరీలను అందించి.. ప్రత్యేకంగా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మగవారు వారు తీసుకొనే ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన కొన్ని రకాల ఎనర్జిటిక్ ఫుడ్ లిస్ట్ మీకోసం...

 

గుడ్లు:
గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. ప్రోటీన్లు: శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్‌ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

 
క్వీనా: క్రార్బ్ నుండి అధిక ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని ఫ్యాట్ ను కరిగిస్తుంది. రైస్ కు బదులు క్వీనోవ్ తీసుకోవడం వల్ల అధిక ప్రోటీనులు పొందవచ్చు. దాంతో ఎనర్జిటిక్ గా ఉండవచ్చు.

 
బ్రొకోలీ: బ్రొకోలి మరియు బ్రజెల్స్, తృణధాన్యాలు, కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ మగవారు తమ డైయట్ లో ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో క్యాన్సర్ తో పోరాడగలిగే కెమికల్స్ అధిక శాతంలో ఉన్నాయి. ఇవి ప్రొస్టేట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ బారీన పడకుండా కాపాడుతాయి. కాబట్టి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. 


బాదాం: బాదంలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బలాన్నివ్వడానికి బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియల్ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యవంతంగా పనిచేసి కావల్సిన శక్తిని అంధించడానికి బాగా సహాయపడుతాయి.

ఓయిస్ట్రెస్: సముద్రంలో చేపల తర్వాత స్థానం ఓయిస్ట్రస్. వీటిలో జింక్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని స్త్రీలు మరియు పురుషులు తీసుకోవడం చాలా అవసరం. పురుషుల సంతానోత్పతి, లైంగిక ఆరోగ్యానికి అవసరమైన జింక్ అత్యధికంగా కలిగి ఉన్నటు వంటి సహజ వనరు. జింక్ మగవారిలో ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడమే కాకుండా ఆరోగ్యరమైన స్పెర్మ్(వీర్యం)వృద్ది చెందడానికి సహాయపడుతుంది. పురుషుల్లో జింక్ లోపించడం వల్ల అత్యధికంగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎక్కువ మోతాదులో జింక్ ను అందించే ఓయిస్ట్రెస్. కాబట్టి పురుషు ఆరోగ్యాని, అందానికి అత్యంత ప్రయోజకారినిగా పనిచేస్తుంది ఓయిస్ట్రెస్.

 


నీళ్ళు: మీ శరీరంలో విషాలు(టాక్సిన్స్)నిల్వ ఉన్నట్లైతే..మీరు చాలా అలసటకు గురిఅవుతారు . కాబట్టి శరీరంలోని మలినాలను తొలగించుకోని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసి ఆరు లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.

 
బ్లూ బెర్రీస్: క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

 
రెడ్ మీట్: కండరాలు బలపరచడానికి రెడ్ మీట్ చాలా సహాయపడుతుంది. కాబట్టి లీన్ మీట్ ను తినడం ఆరోగ్యానికి మంచిది. మరియు అధిక కొలెస్ట్రాల్ ను తీసుకోవడం తగ్గించాలి. లీన్ మీట్ కండరాలు బలపడటానికి మరియు తగినంత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతాయి.

 
ఎడమమే: ఎడమమే ఒక రకమైన బీన్స్. ఈ బీన్స్ లో పోషకాంశాలు అధికంగా ఉంటాయి . అందువల్లే ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని వెజిటేరియన్ ఫుడ్స్ లో చేర్చారు.

 
స్వీట్ పొటాటో: శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అలసట చెందవచ్చు . అటువంటి సమయంలో స్వీట్ పొటాటో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోని కార్భోహైడ్రేట్స్ ఎనర్జీని అంధిస్తాయి. ఇంకా ఇండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 
సాల్మన్: సాల్మన్(Salmon)ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

 
కాఫీ: కేఫినేటెడ్ ఆహారాలు, పానీయులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. అయితే కెఫిన్ ను తగు మోతాదులో మాత్రమే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు. ఇది మైండ్ అలర్ట్ గా ఉంచుతుంది మరియు ఎనర్జీలెవల్స్ ను పెంచే బూస్టర్.

 
గోజి బెర్రీస్: గోజి బెర్రీస్ అనేది లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది చైనీయలు తరతరాల నుండి ఉపయోగిస్తున్న మెడిసిన్. సో మగవారికి లైంగిక సామర్థ్యం పెంపొందించడంలో గోజీ బెర్రీస్ ఎనర్జిటిక్ గా పనిచేస్తాయి.

 
నేరేడు పళ్ళు: సాల్మన్(Salmon)ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.


దానిమ్మ జ్యూస్ (Pomegranate juice): ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. పండులోని "ఇల్లాజిక్ యాసిడ్" ను చర్మంపై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది. దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది. అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
 

అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. గుండె (హృదయము)కు మేలు చేస్తుంది. దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది. రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది. ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది. దానిమ్మ గింజ, నూనె... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.

No comments: