తలస్నానం చేసేటప్పుడు కురులు చిక్కుపడకుండానూ, కురుల కుదుళ్ళు బలహీనపడ కుండానూ, శిరోజాలు రాలిపోకుండానూ, తెల్లబడ కుండానూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు కేశ సంరక్షణ, ఆరోగ్యంపట్ల ఏ విధమైన శ్రద్ధ తీసుకోవలసినదీ ముందుగా తెలుసుకోవాలి. తలస్నానానికి షాంపూ ను ఉపయోగించేవారు దాన్ని ఏవిధంగా ఉపయోగించ వలసినదీ తెలుసుకోవడం అవసరం. షాంపూను సరిగా ఉపయోగించకపోయి నట్లయితే వెంట్రుకల ఆరోగ్యం పాడై, జుట్టు రాలిపోతాయి. తలరుద్దుకునే విషయం, పరిశుభ్రతకోసం వాడే వస్తువులు, నీరు, తలతుడుచుకునే తువ్వాలు, చిక్కుతీసే బ్రష్ లేదా దువ్వెన గురించి సరైన అవగాహన ఉండాలి.
గోరువెచ్చని నీళ్ళు: తలస్నానానికి అధికవేడి నీటినికానీ, చన్నీటిని కానీ ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
శుద్దమైన నీరు: తలస్నానానికి పరిశుభ్రమైన నీటినే ఉపయోగించాలి. ఉప్పునీరు, బోరింగ్ నీరు కంటే శుద్ధమయిన నీటిని వాడటం కురులకు ఆరోగ్యకరం.
హాట్ ఆయిల్ మసాజ్: తలస్నానం చేయటానికి అరగంట ముందుగా కొబ్బరినూనెను వెచ్చచేసి, ఆ నూనెను వెంట్రుకల కుదుళ్ళకు చేరేలాగా పట్టించాలి. వేళ్ళతో మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
శీకాయ: తలస్నానానికి కుంకుడుకాయలు, సీకాయను వాడటం వల్ల జుట్టు మెత్తగా ఉండటమే కాక, జుట్టు ఆరోగ్యమూ బాగుంటుంది.
హేయిర్ ప్యాక్: అభ్యంగన స్నానానికి ముందుగా మెంతులు రుబ్బిన ముద్దను తలకుపట్టించే వారు. పేల నిర్మూలనకోసం హారతి కర్పూరం పొడిని లేదా కలరా ఉండల పొడిని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు రాసేవారు. చుండ్రు నిరోధానికి నిమ్మ రసాన్ని కానీ, లేతవేపాకుల ముద్దను కానీ జుట్టుకు రాసేవారు. హెన్నా తలకుపూసే వారు ముందుగా తలమీద నీరుపోసి, వాటిని కడిగేసిన తర్వాతనే షాంపూను కానీ, సీకాయసబ్బును కానీ, సీకాయ పొడినికానీ, కుంకుడురసాన్ని కానీ వాడాలి.
షాంపూ: తలతడిపిన తర్వాతనే షాంపూతో రుద్దుకోవాలి.షాంపూను నేరుగా జుట్టు మీద వేసుకో కూడదు.చేతిలో కొంచెంవేసుకొని,నీళ్ళు కలిపి, ఆ తర్వాత తలకు పట్టించి, వెంట్రుకలను శుభ్రపరచాలి.
సిట్రస్ పండ్లు: నిమ్మ, కమలాఫలం, నారింజ తొక్క లను, ఎండిన మందార ఆకులు లేదా పూలను మెత్తగా పొడిచేసి, ఆ పొడిని సీకాయ పొడిలో కానీ కుంకుడు కాయ పొడిలో కానీ లేదా కుంకుడు రసంలో కానీ కలిపి తల రుద్దుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. వెంట్రుకలు నిగనిగ లాడుతూ, మృదువుగా ఉంటాయి.
స్టార్చ్: తలస్నానానికి ఉపయోగించే కుంకుడు రసంలో కానీ, సీకాయపొడిలో కానీ అన్నం వార్చిన గంజిని కలిపి తల రుద్దు కుంటే వెంట్రుకలు త్వరగా నెరిసిపోవు.
షవర్ బాత్: షాంపూను ఉపయోగించే వారు ఆ నురగ తలమీది నుంచి, వెంట్రుకల కుదుళ్ళలోంచి పూర్తిగా తొలగి పోయేం త వరకు తలమీద నీళ్ళు పోసుకుని జుట్టును బాగా శుభ్రపరచాలి. తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడితే, వాటిలోని రసాయనాలు కేశాలకు హాని చేస్తాయి. వెంట్రుకల మురికి, జిడ్డు వదలడానికి తగినంత షాంపూను మాత్రమే వాడాలి.వెంట్రుకలను శుభ్రపరచటానికి అడ్డదిడ్డంగా రుద్దకూడదు. అల్లా చేస్తే వెంట్రుకలు చిక్కు పడడం, తెగిపోవడం జరుగుతుంది.
టవల్: వెంట్రుకల తడిని పీల్చడానికి తలకు చుట్టే టవలు మెత్తగానూ, తేలికగాను ఉండాలి. రఫ్‌గానూ బరువుగానూ వుండకూడదు. ఇతరులు వాడిన తువ్వాలను తల తుడుచుకోడానికి ఉపయోగించకూడదు. తలను తుడుచుకునేటప్పుడు పై నుంచి క్రింది వరకూ తుడవాలి. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు.
హెయిర్ డ్రైయ్యర్: తలవెంట్రుకలను సహజ గాలిలోనే ఆరనివ్వాలి. హెయిర్ డ్రయ్యర్ వాడక పోవడమే జుట్టు ఆరోగ్యానికి మంచిది.
వెంట్రుకలు తడిగా వున్నప్పుడు తల దువ్వుకూడదు. ఆరిన తర్వాతనే తల దువ్వుకోవాలి.
వెంట్రుకలు చిక్కు పడినపుడు వేళ్ళతో మెల్లగా ఆ చిక్కును తీయాలి. ఆ తర్వాత తల దువ్వుకోవాలి
తలస్నానం చేసిన తర్వాత వెడల్పు పళ్ళున్న దువ్వెనతో కానీ, తల దువ్వుకునే బ్రష్‌ను ఉపయోగిస్తూ వెంట్రుకలను పై నుంచి క్రిందకు మెల్లగా దువ్వుకోవాలి.
తలస్నానం చేసిన తర్వాత వెడల్పు పళ్ళున్న దువ్వెనతో కానీ, తల దువ్వుకునే బ్రష్‌ను ఉపయోగిస్తూ వెంట్రుకలను పై నుంచి క్రిందకు మెల్లగా దువ్వుకోవాలి.
వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతనే జడ వేసుకోవడం లేదా ముడి చుట్టుకోవడం చేయాలి.
No comments:
Post a Comment