all

Friday, November 23, 2012

వింటర్ స్పెషల్ - మట్టర్ పన్నీర్ సమోసా

చలికాలం వచ్చేసింది. ఓ ప్రక్క చలి.. మరో ప్రక్క మంచు. శరీరాన్ని గజగజా వనికిస్తుంటే ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. హెల్తీ స్నాక్స్ తినడం వల్ల ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
మైదా: 1/2kg
డాల్డా లేదా నెయ్యి: 50grms
ఉప్పు: చిటికెడు
పనీర్ తురుము: 2cups
పచ్చిబఠాణీలు లేదా నానబెట్టిన బఠాణీలు: 1cup
పచ్చిమిర్చి: 6-8
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
నూనె: సరిపడా
Mutter Paneer Samosa Winter Special Snack

తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను జల్లించి ఒక మిక్సింగ్ బౌల్ వేసి అందులో చిటికెడు ఉప్పు, డాల్డా వేసి బాగా కలపాలి, తర్వాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
3. అలాగే బఠాణీలకు కూడా వేసి తడిపోయే వరకూ వేయించాక, పన్నీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదాలో నుంచి కొంత బాగం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.
5. ఇలా వత్తుకొన్న తర్వాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్ లా మడిచి చెంచా నిండుగా ఫ్రై చేసుకొన్న పనీర్ మిశ్రమాన్నిపెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అంతే మట్టర్ పన్నీర్ సమోసా రెడీ..

No comments: