కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4 (whites only)
పాలు: 1tbsp
పెప్పర్: 1tsp
పాలక్: 1 sprig (chopped)
మెంతి: 1/2tsp
ఆయిల్: తగినంత
కొత్తిమీర, పొదీనా: 1 sprig (chopped)
పొదీనా: 5 (chopped)
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.
2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.
3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పొదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.
4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.
No comments:
Post a Comment