all

Friday, December 21, 2012

పది నిముషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - ఫ్రూట్ వ్రాప్

గుడ్లు, సాండ్ విచ్ మరియు పోహ వంటి అతి సులభంగా, అతి త్వరగా తయారైయ్యే బ్రేక్ ఫాస్ట్ రిసిపీలన్నీ మనం ప్రయత్నించే ఉంటాం. అయితే వీటిలో ఏ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరం. త్వరగా అయ్యే రిసిపి మాత్రమే కాదు ఆరోగ్యానికి, ఉపయోగపడే ఈ ఫ్రూట్ వ్యాప్ చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ ఫ్రూట్ వ్రాప్ రిసిపి పది నిముషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, అయితే బ్రేక్ ఫాస్ట్ మాత్రం మిస్ చేయకూడదు అనుకొనే వాళ్ళకి ఇది ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను అన్నింటిని ఉపయోగించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసేయవచ్చు.

మరి మీరూ ప్రయత్నించండి. టేస్ట్ చూడండి...



easy fruit wrap breakfast 10 mins

కావలసిన పదార్థాలు:


రోటీ: 2
ఆపిల్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ద్రాక్ష: 5
దానిమ్మ(గింజలు): 2tbsp
పీయర్(బేరికాయ): 1/2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అరటి పండు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మొయోనైజ్: 1tbsp
చాల్ మసాలా: 1/2tsp


తయారు చేయు విధానం:

1. చాలా మంది ఇళ్ళలో ముందు రోజు రాత్రి తయారు చేసిన చపాతీలు ఒకటో రెండో మిగిలే ఉంటాయి. వాటితో తయారు చేసుకోవచ్చు. బిజీ లైఫ్ లో ఆఫీసుల, స్కూల్స్, కాలేజ్ లు అని టైమ్ లేని వాళ్ళు బయట రెడీమేడ్ లో దొరికే చపాతీలను తీసుకొచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు.

2. పైన ఇచ్చిన వస్తువుల్లో పండ్లు అన్నింటీని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

3. కొన్ని గింజలున్న కాయలను పూర్తిగా కట్ తీసేయకండి గుప్పెడు అయితే సరిపోతాయి. కాబట్టి ఎంత అవసరమో అంతమాత్రం కాయనుండి గింజలను వేరు చేసి పెట్టుకోండి.

4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు చపాతీలకు మొయోనైజ్ ను రాసి, దాని మీద కొంచె ఉప్పును చిలకరించాలి.

6. తర్వాత ఒక్కో చపాతీ మీద పండ్ల మిశ్రమాన్ని కావల్సినంత స్ప్రెడ్ చేయాలి.

7. ఈ ప్రూట్ చపాతీని రోల్ చేసి తినేయాలి అంతే సింపుల్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

మీకు మంచి సువాస కావలనుకొంటే పుదీనా ఆకులను కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు.

No comments: