all

Tuesday, December 18, 2012

దొండకాయ-మామిడి తురుము ఆవకాయ...

వేసవిలో అరుదుగా దొరికే మామిడికాయ అన్నంతో మొదలయ్యే ఆవకాయ పెరుగున్నదాకా కొనసాగుతుంది. అంతే కాదు అన్నంలో కూడ పలురకాలుగా చేసుకొంటారు. కావాల్సినవన్నీ ఉన్నా పెరుగన్నంతో నంజుకుని కడుపారా తినేందుకు మామిడికాయ తొక్కు కావాల్సిందే. ఎండాకాలంలో వచ్చే పుల్లటి మామిడికాయల ముక్కలతో చేసే పచ్చడి రుచే వేరు. దీనిని ఆంధ్రోళ్లు అయితే ఆవకాయ అని, మాగాయ పచ్చడి అని రకరకాలు చేసుకొంటారు. మామిడికాయ ఆవకాయను కొంచెం వెరైటీగా దొండకాయ చేర్చి ఏలా తయారు చేసుకోవాలో చూద్దాం....Mango Tindora Pickle


 
కావలసిన పదార్థాలు:

 దొండకాయలు: 6-8
 పచ్చి మామిడికాయ: 1
 కారం: 2tbsp
 ఆవాలు: 1tsp
 మెంతి పొడి: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup


 తయారు చేయు విధానం:

 1. ముందుగా దొండకాయలను నీళ్ళలో వేసి కడిగేసుకొని తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని పొడి బట్టతో తేమను పూర్తిగా తుడిచేసుకోవాలి. తేమను తుడిచిన తర్వాత కూడా పది పదిహేను నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి.

2. పదిహేను నిమిషాల తర్వాత దొండకాయలను రెండు భాగాలుగా మద్యలోనికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

 3. తర్వాత పచ్చి మామిడి కాయను కూడా శుభ్రం చేసే తడి ఆరిన తర్వాత తురుముకోవాలి. లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

 4. తర్వాత ఆవాలను దోరగా వేయించుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ ను రెడీ చేసుకోవాలి.

 5. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఆవాల పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా దొండకాయ ముక్కలు, మామిడి తురుము(మామిడి ముక్కలు), నూనె కూడా వేసి బాగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.

 6. అంతే దొండకాయ-మ్యాంగో పికెల్ రెడీ. దీన్ని రెండు మూడు గంటలన్నాస్పైసీస్ లో ఊరనివ్వాలి. తర్వాత వాడుకోవాలి. ఇది వేడి వేడి అన్నం, లేదా రోటీ, దోశ లోనికి చాలా రుచికరంగా ఉంటుంది.

 సూచన:
పచ్చి కాయలతో పికెల్ నచ్చని వాళ్ళు, నూనె తప్పా మిగిలిన పదార్థాలన్నీ పై చెప్పినట్టు మిక్స్ చేసుకొని చివరగా కడాయిలో నూనె పోసి అందులో మరి కొద్దిగా ఆవపొడి, మెంతిపొడి, కారం, ఉప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేగించి అందులో దొండమామిడి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత వున్న డబ్బా లేదా బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకొంటే వారం పది రోజుల పాటు ఉంటుంది.

No comments: