సాధారణంగా మాంసాహార ప్రియులకు అంత్య ఇష్టమైనది చికెన్ తో తయారు చేసే రుచికరమైన వంటలు. చికెన్ వివిధరాకాలు వండుకొని తింటుంటారు. అయితే నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ షోరువా భలే రుచిగా ఉంటుంది. ఇది రోటీ, రైస్, పులావ్, కుష్కా వంటి వాటికి మరింత రుచిని అందిస్తుంది. ఈ షోరువాను చికెన్ సూప్ తో తయారు చేస్తారు.
చికెన్ సూప్ తో తయారు చేసే చికెన్ షోరువా ఇండియన్ మసాలాలు, కొద్దిగా ఘాటైనా మసాలా ధినుసులు వేయడంతో మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ షోరువాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి. అందుకు ఏమేమికావాలో ఒక సారి చూసి మీరు ఈ సండే స్పెషల్ వంటకాన్ని ఎంజాయ్ చేయండి.
కావలసినపదార్థాలు:
చికెన్: 750grms,
మిరప్పొడి: 3tbsp (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు),
పసుపు: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున
(కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి),
నూనె: 4tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 2cups
కాశ్మీరీ మిరప్పొడి: 2tsp
మసాలా పౌడర్: 4tsp
ఉప్పు: తగినంత
కొత్తిమీర: గుప్పెడు (సన్నగా తరగాలి)
తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
2. ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.
3. చికెన్ ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి. మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది.
[ మసాలా పౌడర్ తయారి: ఆరు స్పూన్ల ధనియాలు, పది లవంగాలు, ఎనిమిది ఏలకులు, దాల్చినచెక్క రెండు అంగుళాల ముక్క, స్టార్ లవంగం ఒకటి, పాపీ సీడ్స్ రెండు టీ స్పూన్లు తీసుకుని పొడిచేయాలి. ]

No comments:
Post a Comment