లోబీపీ లక్షణాలు గుర్తుపట్టడం కొద్దిగా కష్టం. అయితే కళ్లు తిరగడం, నీరసంగా, అలసటగా అనిపించడం వంటివి కనిపిస్తే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది.
లోబీపీ ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ, వేడి సూప్.. వంటివి సేవించడం మంచిది. శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకని రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పొట్ట ఫుల్‌గా ఉంటే బీపీ స్థాయి తగ్గుతుంది. అలాగే వేపుడు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని, రోజులో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
లోబీపీ ఉన్నవారు నిద్రించినప్పుడు సడెన్‌గా లేస్తే తల తిరగడం, గుండెదడగా అనిపించడం జరుగుతుంది. అందుకని నెమ్మదిగా లేవాలి.
ఎత్తై ప్రదేశాలు ఎక్కుతున్నప్పుడు, పై నుంచి కిందకు చూడటం వంటి సందర్భాలలో గుండె దడ వస్తుంది. అందుకని ముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
లోబీపీ ఉన్నప్పుడు సోడియం కంటెంట్ ఎక్కువగా ఉన్న సూప్‌లు, పదార్థాలు తీసుకోవాలి. డెరైక్ట్‌గా ఉప్పు తినడం కాకుండా ఉప్పు నీళ్లలో నిమ్మరసం పిండి తాగితే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో లో బీపీకి చికిత్స తీసుకుంటూ, వారి సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం.
No comments:
Post a Comment