all

Tuesday, January 15, 2013

నాటు కోడి మామిడికాయ కుర్మా(‘కనుమ'-spl)


కావలసినవి:
కోడి మాంసం - కేజీ; ఉల్లిపాయలు - 4
వెల్లుల్లి రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి) - 5
గసగసాలు - 3 టీ స్పూన్లు
పచ్చికొబ్బరి - కప్పు
పుల్లని పెరుగు - కప్పు
ఉప్పు, కారం - తగినంత
జీడిపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 8
అల్లం - 25 గ్రా.
పసుపు - అర టీ స్పూన్
ధనియాలు - 2 టీ స్పూన్లు
గరం మసాలా - అర టీ స్పూన్ (ఏలకులు - 2 , లవంగాలు - 6, దాల్చిన చెక్క కలిపి తయారుచేసుకోవాలి)
కొత్తిమీర తరుగు -3 టీ స్పూన్లు
మైదా - 4 టీ స్పూన్లు
నూనె - 100 గ్రా.
మామిడికాయ - 3 ముక్కలు

తయారి: కోడి మాంసం కావలసిన పరిమాణంలో ముక్కలు కోసి, శుభ్రపరుచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తరగాలి. ముక్కలకు కారం, పసుపు మసాలా, పెరుగు కలిపి పదినిమిషాలు ఉంచాలి.

కడాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన కోడి ముక్కలను వేసి, కలిపి, వేగనివ్వాలి. ఉప్పు కలిపి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి వేసి, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. ముక్క ఉడికిన తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి.
..................

No comments: