all

Tuesday, January 15, 2013

చనుబాలిచ్చే తల్లికి ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుదల!-బ్రెస్ట్ ఫీడింగ్

 
 
తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి తెలిసిందే. అయితే దాంతో తల్లికీ ఎన్నో ప్రయోజనా లని ఇటీవలి ఒక అధ్యయనం చెబుతోంది. బిడ్డకు చనుబాలిచ్చే తల్లికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంతగా తగ్గుతాయో సప్రామాణికంగా నిరూపించారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 493 మంది మహిళలను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వారితో పోల్చి చూసేందుకు అదే వయసున్న ఆరోగ్యవంతులైన మరో 472 మంది మహిళలను ఎంపిక చేశారు.

పదమూడు నెలలపాటు చనుబాలిచ్చిన వారిలోని 63 శాతం మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్‌గడ్డలు అభివృద్ధి చెందే అవకాశాలే లేవని ఆ అధ్యయనంలో తేలింది. అంతేకాదు... దీర్ఘకాలం పాటు సాగిన మరో అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ముగ్గురు బిడ్డలుండి... వారందరికీ చనుబాలు ఇచ్చిన మహిళల్లో (తమ బిడ్డలు ముగ్గురికీ కలిపి కనీసం 31 నెలలపాటు చనుబాలిచ్చిన మహిళల్లో) 91 శాతం మందికి గర్భాశయంలో గడ్డలు (ఒవేరియన్ ట్యూమర్స్) వచ్చిన దాఖలాలే లేవని తేలిందట. ఈ విషయాలన్నింటినీ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో పొందుపరచారు ఆ పరిశోధకులు. 

No comments: