ఈ తెలుగమ్మాయి తమిళింటి కోడలైంది...
ఆ తమిళబ్బాయి తెలుగింటి అల్లుడయ్యాడు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే... అని ఆయన పాడితే ! అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే అని ఆమె పాడింది !! ‘చూడు అచ్చు నీ పోలికే’ అని మురిపెంగా దెప్పుకోమని దేవుడు ఇద్దరి కోరికా తీర్చాడు. రోజా - సెల్వమణి అన్యోన్యదాంపత్యంలోని మధురిమలే ఈ వారం బెటర్‌హాఫ్!! రోజా ఒకసారి నవ్వితే వందసార్లు గుర్తు చేసుకుంటాం. మరి ఆ నవ్వుతోనే శుభోదయం పలికితే... ఆ ఇల్లు నందనవనమే. అచ్చం అలాగే... అందంగా అల్లుకున్న పొదరిల్లులా ఉంది వీరి ఇల్లు. మేము వెళ్లేటప్పటికి పాపకు డ్రస్ వేసి, జుట్టు దువ్వుతున్నారు రోజా. ఇంతలో సెల్వమణి బాబును తీసుకుని ‘లతా!’ అని రోజా అసలుపేరుతో పిలుస్తూ, ఏదో చెప్పడానికి వచ్చి, కొత్త వ్యక్తిని చూసి వెంటనే వెళ్లబోయారు. ‘‘కుట్టీ! వెళ్లకు కూర్చో మాట్లాడుదాం’’ అని సెల్వమణిని ఆపేశారామె. మీ తొలి పరిచయం ఎలా అనగానే... ‘‘చామంతి సినిమా కోసం హీరోయిన్ వేటలో నేను దొరికాను. అప్పటికే డెరైక్టర్‌గా ఆయన కెరీర్ పీక్‌లో ఉంది. ఏ యాక్టర్ అయినా ఈయన సినిమాలో చేయడం లక్ అనుకునే వారు అప్పట్లో. అందుకే అవకాశం రాగానే ఒప్పుకున్నాను’’ అని రోజా చెప్తుండగా సెల్వమణి అందుకుంటూ ‘‘ఆ సినిమాకు చామనచాయగా, పొడవుగా ఉన్న అమ్మాయి కావాలి. నవ్వు బాగుండాలని వెతికాం. అప్పటికి నలుగురు హీరోయిన్లతో షూట్ చేసి నచ్చక పెండింగ్ పెట్టాను. చివరికి లతను చూసినప్పుడు ఈ క్యారెక్టర్‌కు తను పర్‌ఫెక్ట్ అనిపించింది’’ అన్నారు. సెల్వమణి కొంత పాజ్ తీసుకోగానే రోజా... ‘‘సెల్వ వెతికింది హీరోయిన్ కోసం కాదు, భార్య కోసం అంటుంటారు ఫ్రెండ్స్. నాకేమీ చెప్పకుండా ఒకరోజు మా ఇంటికి వచ్చి మా వాళ్లతో... నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మా వాళ్లకు షాక్! మా ఇంట్లో ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్‌లే లేవు, అలాంటిది ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనగానే ఆందోళన పడ్డారు. కానీ సెల్వ అప్పటికే పెద్ద డెరైక్టరు, వ్యక్తి మంచివాడన్న పేరు ఉంది. దాంతో పెళ్లికి ఒప్పుకున్నారు!’’ అని తమ పరిచయం పెళ్లికి దారి తీసిన వైనాన్ని వివరించారామె. ఒకరిలో ఒకరికి... రోజాలో తనకు నచ్చింది కష్టపడే తత్వమేనన్నారు సెల్వమణి. ‘‘లత హార్డ్‌వర్కింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది. తాను చేయాల్సిన పని తనకు అప్పటి వరకు తెలియనిదైనా సరే... తెలియదు అని ఊరుకోదు, తెలుసుకుని కరెక్ట్‌గా చేస్తుంది. కరెక్ట్‌గా వచ్చే వరకు దాని మీద ఒక పట్టు పడుతుంది’’ అన్నారాయన. ‘‘సెల్వ... స్ట్రీలను గౌరవిస్తారు. ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడంతోపాటు సాఫ్ట్‌కార్నర్ చూపిస్తారు. మహిళలను తప్పుగా ఒక్కమాట కూడా అనరు, ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ పక్షపాతి’’ అన్నారామె మురిపెంగా ఆయనను చూస్తూ. రాజీలన్నీ ఆయనవే! ఒకరి కోసం ఒకరు చేసుకున్న రాజీలు పెళ్లికి ముందే మొదలయ్యాయంటూ... ‘‘నేను చిన్నప్పటి నుంచి బాగా అల్లరిదాన్ని, అడ్జస్ట్‌మెంట్ తెలియదు. పెళ్లయిన తర్వాత కూడా నేనెప్పుడూ రాజీపడిందే లేదు. పెద్ద విషయం ఏమిటంటే... మా రాజీల పర్వం పెళ్లికి ముందే మొదలైంది. 1991లో ఎంగేజ్‌మెంట్ అయింది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు కొంత టైమ్ అడిగాను. నేను డిజప్పాయింట్ కాకూడదని అప్పుడు సరే అన్నారు. ఆ సరే అనడం... అనడం... ఇప్పటి వరకూ నేనేది కావాలన్నా సరే అనడమే. ఈయనకేమో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని రిసెప్షన్ ఇద్దామని. కానీ నా కోరిక ప్రకారమే పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఎప్పుడూ ఎవరింటికీ వెళ్లనివాడు... నా ముచ్చట కోసం పెళ్లికి ఇన్విటేషన్లు ఇవ్వడానికి వచ్చారు. మరో రాజీ ఏంటంటే... తనది కమ్యూనిస్టు భావజాలం. దేవుడిని నమ్మరు. నేను దేవుడిని బాగా నమ్ముతాను. ప్రేమిస్తున్న రోజుల్లో గుడి బయట నిలబడి నన్ను వెళ్లి రమ్మనేవాడు. ఇప్పుడు నాతోపాటు పూజలకు కూర్చుంటున్నారు’’ అన్నారు రోజా. పిల్లల మంచిచెడ్డలు..! మాకు ఇద్దరు పిల్లలు, పాప ఫోర్త్ క్లాస్, బాబు ఫస్ట్ క్లాస్. పిల్లలను ఎక్కువగా సెల్వ చూస్తారు. అందుకే నేను పాలిటిక్స్, టీవీషోలు, సినిమాలు చేసుకోవడానికి సాధ్యమవుతోంది. తను బిజీగా ఉంటే నేను ఇంట్లో ఉంటాను. పిల్లల దగ్గర ఇద్దరిలో ఎవరో ఒకరం ఉంటాం. నా షెడ్యూల్ కూడా శనిఆదివారాల్లో పిల్లలతోనే. అచ్చు నీ పోలికే! పిల్లల్ని అచ్చు నీ పోలికే అని రాంగ్ పర్సెప్షన్‌లో దెప్పుకునే సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు రోజా. ‘‘మా అమ్మాయి అచ్చు నాలాగే, మొండి. బాబు వాళ్ల నాన్నలాగే సాఫ్ట్. పాప ఎప్పుడైనా మొండిగా ఉంటే అన్షుకి నువ్వే చెప్పు, అంతా నీ పోలికే కదా! అని దెప్పుతారు’’ అన్నారామె నవ్వుతూ. మా పిల్లలు ఎంత ముదుర్లంటే... వాళ్ల డిమాండ్‌కు సెల్వ ఒప్పుకోకపోతే నా దగ్గరకు వచ్చి ‘నువ్వు చెప్తే నాన్న ఒప్పుకుంటారు, నువ్వు చెప్పు’ అని నన్ను కన్విన్స్ చేస్తారు. నేను ఏది అడిగినా సెల్వ కాదనరని వాళ్లకూ తెలిసిపోయింది’’ అన్నారామె. సెల్వమణి కూడా నవ్వుతూ నిజమేనన్నట్లు తలూపారు. ఆయన ఆమె భర్త! తన శ్రీమతి సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎదగడం, ఆంధ్రప్రదేశ్‌లో తనను రోజా భర్తగా గుర్తించడం చాలా గర్వంగా ఉందంటారు సెల్వమణి. ‘‘మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 50 ఏళ్లుగా పెరియార్ ఆశయాల కోసం పాటుపడిన కుటుంబం. మా అమ్మ, చెల్లెళ్లిద్దరు మహిళల సమస్యల మీద పని చేస్తున్నారు. ఇక్కడ లతకు ఆ అవకాశం వచ్చింది. సొసైటీకి నువ్వు చేయగలిగినంత చెయ్యి, వెనుకడుగు వేయవద్దని చెప్పాను. నేను ఇంతకంటే ఎక్కువ చెబితే బడాయిగా ఉంటుంది. తననే అడగండి’’ అన్నారు. ఇంతలో రోజా... ‘‘మహిళలు డామినేటింగ్‌గా ఉంటే ఆ భర్తను అయ్యోపాపం అని జాలిగా చూస్తారు. కానీ తను చాలా మెచ్యూర్డ్. మీటింగ్‌లలో నేను ఫ్రంట్‌రోలో, తను వెనుక ఉన్నప్పుడు వెనుక కూర్చున్నవాళ్ల కామెంట్స్ వింటూ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పి నవ్వేవారు. నేను కెరీర్ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఒడిదొడుకులను, ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. నాకే ఎందుకిలా జరుగుతోంది అని డిప్రెస్ అయితే... ప్రతి ప్రయాణంలో పూలు, పండ్లు, రాళ్లు అన్నీ ఉంటాయని అనునయిస్తారు. నేనింట్లో లేనప్పుడు పిల్లలు సరిగా తినకపోతే తనే తినిపిస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని... నా పిల్లల్ని, నా భార్యని ఎలా మిస్ చేసుకుంటానంటారు కూడ. దేవుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి భర్తనిచ్చాడు’’ అన్నారామె. ఆయన కోపం అర్థం అయ్యేదెప్పటికో! మనస్పర్థలు, మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంటూ...‘‘నాకు కోపం వస్తే మళ్లీ తనే పలకరించే వరకు మాట్లాడను. తనూ ఏం తక్కువ కాదనుకోండి. అయితే నాక్కోపం వస్తే వెంటనే తెలిసిపోతుంది. ఆయనకు కోపం వచ్చిన సంగతి మనకు అర్థం కావడానికే చాలా టైమ్ పడుతుంది. ఎందుకు మౌనంగా ఉన్నారా అని నేను రీల్ వెనక్కి వేసుకుని ఒక్కో సంఘటనా గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంతకీ కారణం తట్టదు. అప్పుడు నేనే వెళ్లి ఇక నా వల్ల కావడం లేదు ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని అడిగేస్తాను. అప్పుడూ కారణం చెప్పరు, కానీ మామూలైపోతారు’’ అన్నారామె చెప్పడానికి ఇబ్బందిపడుతున్న సెల్వమణి వైపు చిలిపిగా చూస్తూ.భార్యభర్తలు మనసున మనసై... అన్నట్లు ఒకర్నొకరు అర్థం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందమయం అవుతుందనడానికి ఉదాహరణ ఈ దంపతులే అనిపించింది. మా సంతోషమే తన సంతోషం! లత మా మీద చాలా కన్‌సర్న్‌గా ఉంటుంది. బయట పెద్ద గొంతుతో, పంచ్ డైలాగ్స్‌తో దడదడలాడిస్తుంది. కానీ పిల్లలకు జ్వరం వచ్చినా ఏడ్చేస్తుంది. మా బాబు ఏడవ నెలలో పుట్టాడు, వాడి కోసం మృత్యుంజయ హోమం వంటి పూజలెన్నో చేసింది. మేము ముగ్గురూ నవ్వుతుంటే తను గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. - సెల్వమణి | |||
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Sunday, November 25, 2012
roja-selvamani interview
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment