ఊహ తెలిసి జ్ఞానం వచ్చాక బాహ్యప్రపంచం నుంచి పిల్లలే నేర్చుకుంటారులే అని తల్లిదండ్రులు దృఢంగా విశ్వసిస్తారు. అలా అని వదిలేయడం ఏ మాత్రం సబబు కాదు.
ప్రాచీనమైన మన సంస్కృతి - సంప్రదాయాలను తెలియచేస్తూ, నైతిక విలువలు నేర్పుతూ, అమూల్యమైన జీవన విధానాలతో కూడుకున్న మధురమైన బాల్యాన్ని పిల్లలకు అందివ్వడం తల్లిదండ్రుల బాధ్యత. ఎప్పుడో వృద్ధాప్యం లో పిల్లల పెంపకంలో సరైన జాగ్రత్త తీసుకోలేకపోయామే అని చింతిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. నిజాయితీ, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, గౌరవం, ప్రేమ, దయ, న్యాయం, నిస్వార్థత, సఖ్యత... ఇవి ప్రపంచంలో ఏ ప్రదేశంలోనైనా అంగీకరించే అతి ముఖ్యమైన నైతిక విలువలు. తాము సంతోషంగా జీవించటానికి, తమ చుట్టూ మంచి సమాజాన్ని నిర్మించుకోవటానికి ఈ విలువలు ముఖ్యపాత్ర వహిస్తాయి. చెవులతో విన్నవాటి కంటె కళ్లతో చూసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు పిల్లలు. నైతిక విలువలు ఎక్కడికో వెళ్లి, ఎవరి దగ్గరో నేర్చుకునే విషయాలు కావు. తమ ఇంట్లో తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవలసినవి.
ఊహ తెలిసి జ్ఞానం వచ్చాక బాహ్యప్రపంచం నుంచి పిల్లలే నేర్చుకుంటారులే అని తల్లిదండ్రులు దృఢంగా విశ్వసిస్తారు. అలా అని వదిలేయడం ఏ మాత్రం సబబు కాదు. నియమాలు, పరిధులు, పరిమితమైన హద్దులతో, చక్కటి విలువలతో, క్రమపద్ధతిలో పెరిగిన పిల్లలు చట్టాల్ని, నియమాల్ని గౌరవిస్తూ, సమాజాన్ని గాని ఇతరులను గాని ఇబ్బంది పెట్టకుండా తమ హద్దు తెలిసి ప్రవ ర్తిస్తారు.
చిన్నతనం నుంచే పిల్లలకి నైతిక విలువల ప్రాముఖ్యత తెలుపుతూ పెంచినట్లయితే, వారు పెరిగి పెద్దవుతున్న కొద్దీ తమంత తాముగా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. గాంధీ, నెహ్రూ వంటి నేతల భావాలను గౌరవిస్తూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే, ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు, దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. ఇటీవల సివిల్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ర్యాంకు సాధించిన ఒక అమ్మాయిని, ‘అడ్మినిస్ట్రేషన్‌కు ఉండాల్సిన లక్షణ మేమిటి’ అని అడిగితే, ‘నైతిక విలువలు’ అని జవాబు చెప్పింది. ఈ సమాధానం అందరి పిల్లలది కావాలి. మాటల్లోనే కాకుండా దానిని చేతల్లో చూపాలి. అందుకు తల్లిదండ్రుల పాత్రే ప్రముఖంగా ఉంటుందని తెలుసు కోవాలి. గ్రహించినవి ఆచరణలో పెట్టాలి.

No comments:
Post a Comment