all

Friday, January 4, 2013

సంక్రాంతి స్పెషల్ కర్జూరాలు లేదా డైమండ్ స్వీట్

సంక్రాంతి పండుగ అనగానే వారం పది రోజుల ముందు నుండే మహిళలంతా పిండి వంటల తయారీలో నిమగ్నమయిపోతారు. ఎందుకంటే ఈ పండగను మూడు రోజు పాటు సంబరంగా జరుపుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చే అతిథులు.. చిన్నారుల కోసం పిండి వంటలెన్నో తయారు చేస్తారు.
పండుగ ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పిండివంట ఈ పండక్కి ప్రత్యేకం. ఉదా రాయలసీమలో ప్రత్యేకంగా తీపి గుమ్మడి కూడర, సజ్జరొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు. ఆంధ్రప్రాంతంలో అరిసెలు, బూరెలు, గారెలు, గులాబీలు వంటి పదార్థాలను ఎంతో ఇష్టంగా తయారు చేసుకుంటారు అయితే ఇవి ఎప్పుడూ చేసే పిండివంటలే అయినా పండుగ రోజు చేసే ఈ పిండి వంటలకు మాత్రం రుచి అమోఘమనే చెప్పాలి. సంక్రాంతికి పిల్లలకు పెద్దలకు ఇష్టమైన, టైం పాస్ కు తయారు చేసుకొని డైమండ్ స్వీట్స్ ఎలాతయారు చేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
మైదా: 2cups
పంచదార: 2cups
యాలకులు: 2
నెయ్యి: 2tbsp
గుడ్లు: 2
నూనె: వేయించడానికి సరిపడ
ఉప్పు: చిటికెడు
వంటసోడా: చిటికెడు
సోంపు: ఒక స్పూను
బొంబాయి రవ్వ: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పంచదారను పొడి చేసుకోవాలి.

2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండిని తీసుకుని అందులో చక్కెర, గుడ్లు, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి, ఉప్పు వంటసోడా, సోంపు, రవ్వను వేసి సరిపడినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.

3. తర్వాత ఈ మొత్తాన్ని నాలుగు బాగాలుగా చేసి, ఉండచుట్టుకొని చపాతీ పీట మీద వేసి పిండిని ఒక అంగు ళం మందంగా ఒత్తుకోవాలి.

4. తరువాత చాకు తీసుకుని డైమండ్‌ లేదా నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

5. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న డైమండ్స్ ను కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి వారం పది రోజుల వరకు నిలవ వుంటాయి.

No comments: