all

Tuesday, March 19, 2013

కాలీఫ్లవర్‌తో...


 
NewsListandDetailsకాలీఫ్లవర్‌ కూడా ఓ రకమైన పువ్వు జాతికి చెందినదే. విదేశాల నుండి భారతదేశానికి చేరింది. కాలీఫ్లవర్‌ పువ్వులలో చాలా ఖాళీలు ఉంటాయి. వీటి మధ్య పురుగులు ఉంటాయి. అందువలన చాలామంది ఈ పువ్వును తీసుకొనరు. దీనికి తోడు ధర కూడా ఎక్కువ.

ఏది ఏమైనప్పటికి ఈ కాలీఫ్లవర్‌ పువ్వులలో సి విటమిన్‌ పుష్కలంగా ఉన్నాయి.

శరీరానికి అవసరమైన అన్ని రకాల లవణాలు ఉంటాయి. అందువలన ఖరీదు ఎక్కువ అయినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా, కనీసం అప్పుడప్పుడైనా కాలీఫ్లవర్‌ను కూర రూపంలో గాని, మరొక విధంగా కానీ తీసుకోవటం మంచిది.

100గ్రా కాలీఫ్లవర్‌లో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి.

పిండిపదార్థాలు-5.3గ్రా.
క్రొవ్ఞ్వ పదార్థాలు 0.4గ్రా,
మాంసకృత్తులు-3.5గ్రా,
సున్న(కాల్షియం)-30మి.గ్రా,
భాస్వరం.- 60మి.గ్రా, మెగ్నీషియం -20మి.గ్రా
ఇనుము-1.3మి.గ్రా
ఉప్పు-12మి.గ్రా
పొటాషియం-285మి.గ్రా
పీచుపదార్థం-1.2మి.గ్రా

నిజానికి, క్యాబేజి కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది కాలీఫ్లవర్‌. విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫోలేట్‌ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి.
ఇది క్యాన్సర్‌ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్‌ కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది.
వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది.

No comments: