all

Tuesday, March 19, 2013

ప్రొటీన్లతో పోషకాల అనాస...


 
NewsListandDetails చూడడానికి ముళ్లులాగా ఉండే పండు పైనాపిల్‌. ఆకారం బాగోకపోయినా దానిలో చాలా పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందామా!

- పైనాపిల్‌లో బ్రొమిలైన్‌ అనే ప్రొటియోలిటిక్‌ ఎంజైమ్‌ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.

- సైనసైటిస్‌, గొంతునొప్పి, కీళ్లనొప్పులు, పంటి వ్యాధులతో బాధపడేవారిలో వాపులూ, మంటలూ నొప్పులూ ఎక్కువ. పైనాపిల్‌ తింటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కారణం ఈ బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండు.

- అయితే దీన్ని ఉదయం భోజనం అయిన తరువాత అంటే మధ్యాహ్న సమయంలో తింటే మంచిది.

- ఇందులోని ఎంజైమ్‌ రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరతిగతిన బాగుచేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లనీ ఇతరత్రా గాయాల్నీ కూడా త్వరగా తగ్గిస్తుంది.

- ఇది కడుపులోని పురుగుల్నీ చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు మూత్రపిండాల్ని ప్రేరేపించి శరీరంలో మలినాలు తొలగిపోయేలా చేస్తాయి.

- హృద్రోగ బాధితులా...అయితే పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్‌. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. అయితే హీమోఫీలియా మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం దీని సహజ స్వభావం కదా. అందుకే.

- గొంతునొప్పి, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధుల్నీ పైనాపిల్‌ తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. మతిమరపు, డిప్రెషన్‌లనీ తగ్గిస్తుంది.

- పైనాపిల్‌లోని సి-విటమిన్‌ బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.

- వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని కొన్ని కణాలకి కేన్సర్‌లతోనూ పోరాడగల శక్తి ఉంది.

- ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. దగ్గుకీ, జలుబుకీ ఇది మంచి మందు. ఇందులో బ్రొమిలైన్‌ దగ్గు రాకుండా చేస్తుంది.

- చెట్టు నుంచి కాయను తెంపిన తరువాత ఇది పండదు. కాబట్టి పండిన తరువాతే వీటిని కోస్తుంటారు. బాగా పండిన పైనాపిల్‌కు గుర్తేమిటంటే పైనుంచే ఆకుల ముచ్చికను తీయగానే వచ్చేస్తుంది. పండిందా లేదా అనడానికి గుర్తుగా వాసన వస్తే చాలు.

- పండు నెత్తిమీద కుచ్చులా ఉండే ఆకులు పసుపు రంగులోకి మారినా ఒంటిమీదుండే కల్లు మరీ ముదురురంగులో ఉన్నా పై తొక్కమీద ముడతలు కనిపించినా పండు పాడయిందని గుర్తించాలి.

- ఇది గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువరోజుల నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినడమే మంచిది.

- చాలామంది పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలానే దీనికి ఫ్రిజ్‌ పడదు. బయట ఉంచడమే మంచిది.

- తొక్కుతీసిన పైనాపిల్‌ను వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. జ్యూస్‌ని ఫ్రిజ్‌లో పెడితే రుచి మారుతుంది. దానికన్నా ముక్కలుగా నిల్వ చేయడమే మంచిది. కేనింగ్‌ లేదా ప్రాసెస్‌ చేసినవయితే ఏడాది వరకూ నిల్వ ఉంటాయి.

No comments: