గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, March 19, 2013
మీ ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా?
మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఏదైనా సరే ప్రతిరోజు మనం తినే తిండిలో సమతుల్యత లేకపోతే చిక్కుల్లో పడ్డట్టే. అందుకేనేమో ఇప్పుడు పోషకవిలువల గురించి ప్రచారం చేస్తున్నారు. ఏ వయసులో ఏం తీసుకోవాలో, ఏ సమయానికి ఏది తీసుకోవాలనేది కూడా ఇప్పుడు బాగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కలగలసిన ఆహారం ఇప్పుడు శరీరానికి బలంతో పాటు ఆయుష్షుకు చేదోడుగా కూడా ఉంటోందని చెబుతున్నారు ఆహార నిపుణులు.
కొన్ని పోషక విలువలు;
కొన్ని ఆహార పదార్థాల్లోనే ఉంటాయి. అవేమిటో ఒక్కసారి చూద్దాం...
బీన్స్: ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ మోతాదులో ఉండి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. మెదడుకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్ బి1 ఇందులో సమృద్ధిగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు.
యాపిల్: ఇందులో కూడా ఫైబర్ సమృద్ధిగా దొరుకుతుంది. అయితే కాసిన్ని కార్బొహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అయితే తక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో కేన్సర్‌ను నివారించేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా బ్రెయిన్ పనిచేసేందుకు సహకరిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్ వ్యాధి రాకుండా యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులకు కావలసిన ఆక్సిజన్‌ను కూడా సప్లయ్ చేస్తుంది.
ఆరెంజ్: ఫోలేట్ థియామిన్ అనే పదార్థం ఇందులో బాగా లభిస్తుంది. నరాలకు అవసరమయ్యే కెరొటి నాయిడ్ అనే పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. ఎర్రరక్త కణాల అభివృద్ధికి ఇది బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను వృద్ధికాకుండా ఆపుతూ ఉంటుంది. మెదడుకు కావలసిన యాంటి ఆక్సిడెంట్స్‌ను అందిస్తూనే, విటమిన్ సిని సమృద్ధిగా పంపిణీ చేస్తుంది.
ఎర్రద్రాక్ష: ఆంథోసియానిన్ అనే పదార్థం లభిస్తుంది. ఈ పదార్థం కేన్సర్ నిరోధకానికి బాగా ఉపయోగపడుతుంది. గుండె, మెదడుకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను రాకుండా కాపాడేందుకు ఈ ఎర్రద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది.
చేపలు: మాంసాహారంలో ఇంతకు మించిన మంచి ఆహారం మరెందులోనూ లేదు. కొలైన్, కొబాలమిన్ (బి12), నియాసిన్ (బి8), ఒమేగా-3, ఫాటీయాసిడ్స్ లాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. గుండెకు సంబంధించిన జబ్బులను నివారిస్తాయి. నరాల ఫంక్షనింగ్‌కు, డిప్రెషన్ నివారణకు చేపల ఆహారం చాలా మంచిది. పైరిడాక్సిన్ (బి6) అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి.
వ్యాయామం చేస్తున్న వారికైతే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. వ్యాయామం లేనివారైనా సరే ఈ పదార్థాలను తీసుకోవడంలో అజాగ్రత్త వహించవద్దు. ఆహారంలో సమతుల్యత పాటించినప్పుడే ఆరోగ్యం మన సొంతమవుతుంది.
No comments:
Post a Comment