all

Monday, November 26, 2012

విభిన్న రుచితో నీలగిరి చికెన్ కుర్మా

కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 1/2kg
ఉల్లిపాయలు: 2(సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టొమాటో: 1 లేదా 2 (సన్నగా కట్ చేయాలి)
కారం: 1tsp
నిమ్మరసం: 1tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె: సరిపడా
కొత్తిమీర: తగినంత
వేయించడానికి కావలసినవి:
జీలకర్ర: 1tsp
సోంపు: 1tsp
గసగసాలు: 1tsp
దాల్చిన చెక్క: చిన్నముక్క
ఏలకులు: 2-3
పచ్చి కొబ్బరి తురుము: 1/2cup
జీడిపప్పు: 10
శనగలు: 1tsp(కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
చిన్న ఉల్లిపాయలు: 10
పచ్చిమిర్చి: 4
కొత్తిమీర తరుగు: 3tbsp
పుదీనా ఆకులు: 1/4cup
Nilgiri Chicken Korma
తయారు చేయు విధానం:
1. ముందుగా వేయించడానికి తయారు చేసిన పదార్థాలన్నింటిని స్టౌ మీద పాన్ పెట్టి ఒక దాని తర్వాత ఒకటి దోరగా అతి తక్కువ మంటలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వేయించిన పదార్థాలు చల్లబడిన తర్వాత వాటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి.
4. అందులోనే కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
5. టమోటో మెత్తబడి నూనె పైకి తేలే సమయంలో వేయించి, గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా మిశ్రమాన్ని వేసి మరో పది నిముషాలు ఉంచాలి.
6. తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌ లో ఉంచాలి చికెన్ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, స్టౌ ఆఫ్ చేయాలి అంతే నీలగిరి చికెన్ కుర్మా రెడీ. ఇది పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా చాలా బాగుంటుంది.

No comments: