కావలసిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
పంచదార: 1.5cup
పచ్చికొబ్బరి తురుము: 1/2cup
యాలకులపొడి: 1tsp
జీడిపప్పు: 5-10
బాదాం పప్పు: 4-6
కిసిమిస్: 5-10
పాలు: 2cups
నెయ్యి: 4tsp
నీళ్ళు: 1 cup
తయారు చేసే విధానం:
1. ముందుగ పెసరపప్పును బాణలిలో నెయ్యి వేడి చేసి అందులో పెసరపప్పును వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి.
2. తరువాత కుక్కర్లో ఒక కప్పు పాలు, నీళ్ళు, వేయించిన పెసరపప్పు, కొబ్బరి తురుము అన్ని కలిపి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
3. ఇప్పుడు మరొక పాత్రలో మిగిలిన పాలు, పంచదార, వేయించిన ఎండుద్రాక్ష చేర్చి బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
4. తరువాత బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిసిమిస్, బాదాం పప్పు, వేసి దోరగా వేయించి ఈ మిశ్రమంలో వేసి చివరగా యాలకులపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే రుచిగా వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ...
No comments:
Post a Comment