all

Monday, November 26, 2012

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - గ్లార్లిక్ ఫ్రైడ్ రైస్

వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు. నేచర్ సృష్టించిన నికార్సయిన మెడిసిన్ ఇది. మనం తినే ఆహారం లో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది. LDL ని నియంత్రించే యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది .సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ సి అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగా పనిచేస్తుంది. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వెల్లుల్లితో చేసి వంటలు తినడం ఆరోగ్యకరం...

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
బటర్: 4tbsp
వెల్లుల్లి రెబ్బలు: 15
ఉల్లిపాయ: 1(సన్నగా తరగాలి)
క్యాబేజీ తరుగు: 1/2cup
బ్రొకోలి: 1/2cup
ఎండు మిర్చి: 5(మధ్యకు విరవాలి)
అజినమోటో: 1/2tsp
నూనె: 2tbsp
జీడిపప్పు పలుకులు: తగినన్ని
తాలింపు దినుసులు: తగినన్ని
బేబీకార్న్: 4(ముక్కలు చేయాలి)
వేయించిన వెల్లుల్లి రెబ్బల తరుగు: 3tbsp
Healthy Breakfast Garlic Fried Rice
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి.
3. అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని, ఆరనివ్వాలి. అందులో బటర్, ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత పాన్‌ లో టేబుల్ స్పూన్ నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలు వేసి, గోధుమరంగు వచ్చేవరకు ఉంచి, బేబీకార్న్ ముక్కలు, క్యాబేజీ తరుగు, అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి.
6. అందులోనే ఉప్పు, అన్నం వేసి క లిపి, 10-15 నిమిషాలు ఉంచి, చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. అంతే గార్లిక్ రైస్ రెడీ ఏదైనా గ్రేవీతో ఈ ఫ్రైడ్ రైస్‌ని సర్వ్ చేయాలి.
  

No comments: