all

Monday, November 26, 2012

షుగర్ ఉన్న వారు హ్యాపీగా తినే దొండకాయ..

దొండకాయ చాలా అరుదుగా చేస్తుంటారు. అయితే ఇది సంవత్సరం అంతా విరివిగా దొరుకుతుంది. దొండకాయలో బీటాకెరోటిన్, అధిక ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను కలిగి ఉంటుంది. దొండకాయను మధుమేహగ్రస్తులు తీసుకోవడం చాలా ఆరోగ్యకరంమని ఒక వైద్య అద్యయనంలో పేర్కొన్నారు. దొండకాలో రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించాడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దొండకాయను మధుమేహగ్రస్తులు మాత్రమే కాకుండా అందురూ తీసుకోవల్సినటువంటి ఆరోగ్యకరమైన ఆహారం. సాధారణంగా దొండకాయను కర్రీగాను... ఎక్కువగా వేపుడుగాను తయారు చేస్తుంటారు. కొంచెం వెరైటీగా బిర్యాని తయారు చేసి చూడండి.. రుచికరమై, ఆరోగ్యకరమైన ఈ వంటకం అందరూ ఇష్టంగా తినాల్సిందే...
కావలసిన పదార్థాలు:
బియ్యం : 2cups
దొండకాయలు: 250grms
బంగాళదుంప: 1
క్యారెట్: 1
టొమాటో: 1
ఉల్లిపాయ: 1
దాల్చినచెక్క : చిన్నముక్క
లవంగాలు: 2
మిరియాలు: 1/2tsp
పచ్చిమిర్చి: 2
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత
కొత్తిమీర: కట్ట

Ivy Gourd Biryani
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కూరగాయలను కావలసిన సైజులో తరిగి సిద్ధం చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత కూరగాయల ముక్కలు వేసి ఉడికిన తర్వాత మిరియాలు వేసి ఉప్పు చల్లి వేగనివ్వాలి.
5. అంతలోపు మరొక గిన్నె స్టౌ మీద పెట్టి అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి దాల్చినచెక్క వేసి మరిగించాలి. నీరు మరుగుతుండగా కడిగి ఉంచిన బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం పలుకుగా ఉన్నప్పుడు ఉడికించిన కూరగాయల మిశ్రమం ఇందులో వేసి కలపాలి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. అంతే దొండకాయ బిర్యాని రెడీ.

No comments: