కావలసిన పదార్ధాలు :
రవ్వ: 2cups
సేమ్యా : 2cups
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయ : 1
కారట్ తురుము : 1cup
పెరుగు : 3cups
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : రుచికి తగినంత
వంటసోడా: చిటికెడు
నూనె : 2tbsp
తాలింపుకు : శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి రవ్వను దోరగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనెలో సేమ్యాను గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని రవ్వలో వేసి కలుపుకోవాలి.
3. ఇప్పుడు రవ్వ, సేమ్యా మిశ్రమంలో పెరుగు, తగినంత ఉప్పు, వంటసోడా వేసి బాగా కలిపి ఒక గంట సేపు నాననివ్వాలి.
4. ఒక స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కారట్ తురుము వేసి ఒక నిమిషం వేయించి నానిన రవ్వ మిశ్రమం లో కలపాలి.ఇవి ఇష్టం లేనివారు కలపకుండా ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు.
5. ఈ మిశ్రమం గట్టిగా ఐతే కొంచెం నీరు కలిపి ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పది నిమిషాలు ఉడికించాలి.
6. వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డిస్తే రవ్వ సేమ్యా ఇడ్లీ సిద్దం. మైక్రోవేవ్ లో వేయాలంటే 640 వాట్స్ లో 5 నిమిషాలు పెడితే ఇడ్లీలు రెడీ అవుతాయి.ఐతే తప్పనిసరిగా మూత పెట్టి మాత్రమే ఓవెన్ లో ఉడికించాలి.
No comments:
Post a Comment