all

Monday, November 26, 2012

స్పైసీ బోన్ లెస్ చిల్లీ చికెన్

కావలసిన పదార్థాలు:బోన్ లెస్ చికెన్: 1(కావలసిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
కాశ్మిరి చిల్లీ పౌడర్: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
సోయా సాస్: 2tbsp
పెరుగు: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 4
చిల్లీ సాస్: 2tbsp
టమోటో సాస్: 2tbsp
క్యాప్సికమ్: 1(రెడ్ క్యాప్సికమ్)
క్యాప్సికమ్: 1(గ్రీన్ క్యాప్సికమ్)
మిరియాలపొడి: 1tsp
Boneless Chilli Chicken
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాశ్మిరీ చిల్లి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఉప్పు, పెరుగు, కారం, కార్న్ ఫ్లోర్ అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మసాలా అంటించిన చికెన్ ను అరగంట పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి.
4. అరగంట తర్వాత ఒక పాన్ లో ఈ మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్ గా వేగిన వెంటనే చిల్లీ సాన్, సోయాసాస్, టమోటో సాస్, వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
6. 5-10నిముషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి ఫ్రై చేయాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ చల్లి తక్కువ మంట మీద మరో రెండు నిమిషాలు అలాగే పెట్టాలి.
7. తర్వాత రెడ్ మరియు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను వేసి చికెన్ తో పాటు మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. అంతే బోల్ లెస్ చిల్లీ చికెన్ రెడీ.
8. చికెన్ ను కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి.
నోట్: కాశ్మిరీ చిల్లి పౌడర్ కు బదులు ఇంట్లో సాధారణంగా ఉపయోగించి చిల్లీ పౌడర్ ఉపయోగించవచ్చు.

No comments: