ఇండియన్ స్వీట్స్ అనగానే మనకు ముందగా గుర్తొచ్చేది పాయసం, గులాబ్ జామున్, క్యారెట్ హల్వా, బీట్ రూట్ హల్వా. క్యారెట్ హల్వా చాలా ఫేమస్. అలాగే పెసరపప్పు హల్వా, సూజీ హల్వా ఇలా కొన్ని రకాలు స్వీట్స్ ను మనల్ని ఎప్పుడూ సంతోషపెడుతాయి. వాటి రుచులు అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో మరొ కొత్త టేస్ట్ తో బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా తయారు చేయడం చాలా సులభం మరియు తక్కువ సమయంలో తయారవుతుంది. వీక్ ఎండ్స్ లో ఇలాంటి వాటిని ప్రయోగించి కొత్త రుచులను మీ కుటుంబ సభ్యులకు అంధించండి.
కావల్సిన పదార్థాలు:
మిల్క్ బ్రెడ్: 1 ప్యాకెట్
బాదాం: 12
జీడిపప్పు: 12
యాలకులు: 6
నెయ్యి: 1cup
పాలు: 1/2 litre
పంచదార: 1 cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ ను సైడ్ లో బ్రౌన్ కలర్ లో ఉన్న అంచులను తొలగించి, ఆ తర్వాత బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా(ఒక అంగుళం) చేసుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ లో ఒక కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిఅయ్యాక, అందులో బాదాం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే నెయ్యిలో ముక్కలు చేసి పెట్టుకొన్న బ్రెడ్ ను వేసి ఐదు నిముషాల పాటు వేయించాలి. ఎప్పుడైతే బ్రెడ్ బ్రౌన్ కలర్ లోకి మారుతుందో అప్పుడు బ్రెడ్ ను మరో గిన్నెలోనికి తీసుకోవాలి.
4. అంతలోపు మరో గిన్నెలో పాలు పోసి కాగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు అందులో స్పూన్ నిండుగా పంచదారను వేసి పంచదార కరిగే వరకూ వేయించాలి.
5. వేయించి బాదాం, జీడిపప్పు మినహా మిగినవి యాలకులు, కొన్ని జీడిపప్పు, బాదాంను మిక్సీలో వేసి కొద్దిగా నీరు చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి.
6. ఈ పేస్ట్ ను కాగే పాలలో వేసి బాగా కలగలిపి మరో ఐదు నిముషాల పాటు ఉడికించాలి.
7. పాలు చిక్కబడే సమయంలో వేయించి పెట్టుకొన్న బ్రెడ్ ముక్కలను వేసి తక్కువ మంటలో ఉడికించాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ. వేయించి పెట్టుకొన్న బాదాం, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. ఈ రిసిపిని వేడిగా లేదా చల్లబడినతర్వాత కూడా సర్వ్ చేయవచ్చు

No comments:
Post a Comment