షహీ టోస్ట్ అనేది ఇడియన్ స్వీట్ రిసిపి. ఈ బ్రెడ్ రిసిపి చాలా సులభం. మరియు అతి త్వరగా తయారైపోతుంది. ఈ రుచికరమైన షహీ టోస్ట్ ను పాలు, బ్రెడ్ మరియు డ్రై ఫ్రూట్స్ నట్స్ తో తయారు చేస్తారు. బ్రెడ్ తో తయారు చేసే ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది. పాలు తాగని మారం చేసే పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం. ఇలా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ : 5-6స్లైస్
పాలు: 1/2ltr
యాలకలు: 1-2
కుంకుమ పువ్వు: చిటికెడు
పంచదార: 1-2cups
బాదాం: 1/2cup(చిన్నగా కట్ చేసినవి)
జీడిపప్పు: 1cup
ఎండు ద్రాక్ష: 1/2cup
పిస్తా: 1/2cup
వెజిటేబుల్ ఆయిల్: 1/2cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ స్లైస్ ను తీసుకొని వాటిని ప్లేట్ లో పెట్టి కత్తితో నాలుగు పీసులుగా కట్ చేయాలి. బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ ను తొలగించి పడేయాలి.
2. తర్వాత డీప్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి అందులో వెజిటేబుల్ ఆయిల్ వేసి మీడియం మంట పెట్టాలి.
3. అందులో కట్ చేసి అన్ని బ్రెడ్ పీసులను వేసి తక్కువ మంట మీద ఫ్రై చేయాలి. బ్రెడ్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక పాన్ లో పాలు పోసి మీడియం మంట మీదా బాగా మరగ కాచాలి. పాలు మరుగుతున్నప్పుడు అందులో యాలకులు, కుంకుమ పువ్వు వేసి, పంచదార కూడా కలిపి బాగా మరిగించాలి.
5. పాలు బాగా చిక్కబడిన తర్వాత అందులో బ్రెడ్ పీసులను వేసి రెండు మూడు నిముషాల తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి వాటి మీద కూడా చిక్కటి పాలు పోయాలి. అలాగే బాదం, జీడిపప్పు, ద్రాక్ష, పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే షహీ టోస్ట్ రెడీ. దీన్ని వేడిగా కానీ లేదా చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేయొచ్చు.

No comments:
Post a Comment