గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలిసిన విషయమే. మనం ఎగ్ ను ప్రతి రోజూ ఏదో విధంగా ఆహారంతో పాటు తీసుకొంటుంటాం. ఉడికించి, ఎగ్ బుర్జు, ఎగ్ గ్రేవీ, ఎగ్ ఆమ్లె, ఎగ్ రైస్.. ఇలాంటి మనం తరచూ చేసుకొంటుంటాం. అదే ఎగ్ తో కొంచెం వెరైటీగా ఇంట్లోనే ఎగ్ పిజ్జా తయారు చేసి పిల్లలకు పెద్దలకు అందించవచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. చేయడం కూడా సలభం. రుచి అద్భుతం. పిల్లలు పెద్దలు ఇష్టం గా తినే ఈ హోం మేడ్ ఎగ్ పిజ్జాను మీరు తయారు చేసి చూడండి...
కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
క్యారెట్: 2-3
బంగాళాదుంపలు: 3(మీడియం సైజ్)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కరివేపాకు: నాలుగు రెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు, కారం: రుచికి తగినంత
నూనె: సరిపడా
వెన్న: కొద్దిగా
బ్రెడ్ స్లైస్: 6-8
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టి అందులో ఉప్పు, కారం కలిపి బాగా గిలక్కొట్టాలి.
2. తర్వాత ఆ గిన్నెను కుక్కర్ కు విజిల్ పెట్టకుండా సొనను ఉడికించి దించేస్తే అది జున్నులా తయారవుతుంది. దాన్ని ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
3. తరవాత పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీరను సన్నగా తరిగి ఉంచుకోవాలి. బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక మెత్తగా చేయాలి.
4. ఇప్పుడు బాణలిలో నూనె వేసి స్టౌ మీద పెట్టాలి. వేడయ్యాక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం మగ్గించి ఉప్పు, బంగాళాదుంప ముద్ద, సొన ముక్కలు కలపాలి.
5. మరికొద్దిసేపటికి కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి సన్నటి మంట ఉంచి మూత పెట్టాలి.
6. ఇప్పుడు అంచులు తీసిన బ్రెడ్‌కు వెన్న రాసి గుడ్డుకూరను దానిమీద పరచాలి. దానిపైన మరొక బ్రెడ్ ను ఉంచాలి. ఇప్పుడు ఈ ముక్కలను నూనె వేసి పెనం మీద కాల్చాలి. అంతే నోరూరించే ఎగ్ పిజ్జా తయారయినట్టే.

No comments:
Post a Comment