all

Monday, November 26, 2012

లోక్యాలరీ హెల్తీ ఫ్రైడ్ రైస్

కర్రీ ఫ్రైడ్ రైస్ చాలా సులభమైనటువంటి వంటకం. కరివేపాకు సువాసనతో తయారైటటువంటి ఈ కర్రీ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకానికి రుచి కూడా కరివేపాకు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఇంకా ఈ వంటకు ఎండు కరివేపాకు లేదా కరివేపాకు పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఫ్రై రైస్ వెరైటీలలో ఇది కూడా ఒక వైరైటీయే. దీనికి సోయాసాస్, అజినామోటోతో మరింత రుచి కూడా. ఈ వంటకం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెజిటేబుల్స్ వాడటం వల్ల లోకాలరీస్ ను కలిగిఉంటుంది. మరీ ఈ సింపుల్ రిసిపినీ మీరు ట్రై చేసి కొత్త రుచిని టేస్ట్ చేయండి..
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లిపాయలు: 2-3(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
క్యారెట్: 1cup(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
బీన్స్: 1cup(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
జీడిపప్పు: 1/2cup
కర్రీ పౌడర్: 2-3tbsp
సోయా సాస్: 1-2tbsp
అజినామాటో: 1tsp
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
Curry Fried Rice
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో బియ్యం కడిగి సరిపడా(నాలుగు కప్పుల) నీళ్ళు పోసి, కరివేపాకు వేసి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకూ పూర్తిగా మంట పెట్టి ఉడకనివ్వాలి.
2. ఒకటి లేదా రెండు విజల్ కు ప్రెజర్ కుక్కర్ ను క్రిందికి దింపుకొని, ఆవిరి అంతా పోయేంత వరకూ అలాగే పక్కన పెట్టేయాలి.
3. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిఅయ్యాక ఉల్లిపాయల ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే క్యారెట్, బీన్స్ , క్యాప్సికమ్ ముక్కలను, కొద్దిగా ఉప్పును చేర్చి మీడియం మంట మీద పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే జీడిపప్పు, కర్రీ (సాంబార్)పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత సోయా సాస్ వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
6. సోయాసాస్ కలర్ పూర్తిగా వచ్చిన తర్వాత అజినామోటోను కూడా వేసి కలపాలి.
7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి పొడి పొడిగా చేసి పెట్టుకొన్న అన్నం ను వెజిటేబుల్ ఫ్రైలో వేసి, బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే తక్కువ మంట మీద ఉంచాలి. దాంతో వెజిటేబుల్ ముక్కలన్నీ అన్నంతో కలిసిపోయి మంచి టేస్ట్ ను అందిస్తుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే కర్రీ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ఏదేని గ్రేవీతో కానీ, గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేయవచ్చు.

No comments: