కావలసిన పదార్థాలు:
పుదీనా: రెండు కట్టలు
కొత్తిమీర: ఒక కట్ట
వెల్లుల్లి రెబ్బలు: 5-6
అల్లం: చిన్నముక్క
పచ్చిమిర్చి: 8-10
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం లేదా చింతపండు గుజ్జు: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్తిమీరను కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి అవి పక్కన పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
2. తర్వాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ లో కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనిమ్మరసం లేదా చింతపండు గుజ్జు కలపాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment