all

Monday, November 26, 2012

అరటికాయ మసాలా పులుసు-సౌంత్ ఇండియన్ స్పెషల్

పచ్చి అరటి కాయతో చాలా రకాల రుచికరమైన వంటలు వండుతారు. పచ్చి అరటి కాయతో చేసే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సౌంత్ ఇండియన్ వంటకాల్లో అరటికాయతో చేసే వంటలు చాలా ఫేమస్. అందులోనూ అరటికాయ పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. అరటికాయ ముక్కలు కమ్మగా, చింతగుజ్జు చేర్చడంతో కొంచెం పుల్ల పుల్లగా ఉండే ఈ పులుసు రైస్ కు మంచి కాంబినేషన్. ఈ పులుసు ఎక్కువ కరివేపాకు వేయడం వల్ల మరింత సువాసతో నోరూరిస్తుంటుంది.
aratikaaya masala pulusu plantain curry

కావలసిన పదార్ధాలు:
పచ్చి అరటికాయలు: 5(పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
ఆవాలు: 1tsp
నూనె: కావలసినంత
కారం: 1tsp
పసుపు: 1/4tsp
చింతపండు గుజ్జు: 2tbsp
వెల్లుల్లిపాయలు: 5-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(తురుము కోవాలి లేదా కట్ చేసుకోవాలి)
బియ్యం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లి, బియ్యం, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పై పొట్ట తీసి కట్ చేసి పెట్టుకొన్న అరటికాయ ముక్కలను కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడిఅయ్యాక అందులో నూనె వేసి కాగనివ్వాలి.
4. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు మరియు కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి.
5. వేపుడు వేగిన తర్వాత అందులో, కారం, పసుపు కూడా వేసి వేయించిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి కలియబెట్టాలి. తర్వాత రెండు కప్పుల నీరు చేర్చి బాగా ఉడికించాలి
6. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అందులో ఉడికంచి పెట్టుకొన్న అరటికాయ ముక్కలను కూడా వేసి మరో రెండు నిముషాలు వేయించాలి.
7. గ్రేవీ చిక్కబడేదాక ఉడికించి చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి క్రిందికి దింపుకోవాలి. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే అరటికాయ పులుసు రెడీ.

No comments: