all

Monday, November 26, 2012

ఘుమ ఘుమలాడే ఆనియన్ పులావ్

సాధారణంగా మనం ఉల్లిపాయ లేనిదే ఏ వంటా వండం. ముఖ్యంగా సైడ్ డిష్ లు, మరియు కర్రీస్, ఫ్రైస్, బిర్యానీ, రైతా, సలాడ్స్ ఇలా అన్నింటిలోకి ఆనియన్సే. ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచికరంగా ఉంటుంది. కాబట్టి ఆనియన్ అన్ని వంటకాలకు ఉపయోగిస్తుంటారు. అయితే ఆ ఆనియన్స్ తో పులావ్ చేస్తే చెప్పలేనంత రుచితో ఘుమ ఘుమలాడాల్పిందే. అయితే ఈ ఆనియన్ పులావ్ లో రెండు రకాల ఆనియన్స్ ను ఉపయోగిస్తారు. ఒకటి సాధారణంగా ప్రతి రోజూ ఉపయోగించే ఆనియన్ మరొకటి బేబీ ఆనియన్(చిన్న ఉల్లిపాయలు).
aromatic onion pulao recipe

ఆనియన్ పులాప్ టిఫ్, లంచ్ బాక్స్ లకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అరగంటలోపు తయారు చేసుకొనే ఈ ఆనియన్ పులావ్ మిగిలిన రైస్ ఐటమ్స్ కంటే రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు తయారు చేసి చూడండి...
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups(1గంట పాటు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1(చిన్న గా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
లవంగాలు: 5
చెక్క: చిన్నముక్క
పచ్చిమిర్చి: 4(మద్యకు కట్ చేసుకోవాలి)
నెయ్యి: 1tbsp
బిర్యాణి ఆకు: 6
చిన్న ఉల్లిపాయలు: 6
బట్టర్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చిన్న ఉల్లిపాయలను కొద్దిగా నీళ్ళలో వేసి, ఐదు నిముషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి కాగనివ్వాలి. ఒక సారి ఇది కరిగి, వేడి అయ్యేటప్పుడు అందులో జీలకర్ర వేసి వేయించాలి .
3. ఒక నిముషం తర్వాత అందేలోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు మరియు లవంగాలు, చెక్క వేసి, తక్కువ మంట మీద రెండు నిముషాలు వేయించాలి.
4. తర్వాత అందులో క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరో రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. అందులోనే ముందుగా నానబెట్టుకొన్న బాస్మతి రైస్ ను నీరు వంపేసి ఫ్రైయింగ్ మిశ్రమంలో వేసి రెండు నిముషాలు వేయించాలి.
5. తర్వాత అందులో మూడు కప్పుల నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి, మీడియం మంట మీద మరో పది నిముషాలు ఉడికించాలి .
6. అంతలోపు మరో పాన్ తీసుకొని అందులో బట్టర్ వేసి కరిగించాలి. అందులోనే కొద్దిగా పంచదార కూడా వేసి కలియ బెట్టాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న చిన్న ఉల్లిపాయలను వేసి మూత పెట్టి మరో రెండు మూడు నిముషాల ఉడికించాలి.
7. బేబీ ఆనియన్స్ ఉడికిన తర్వాత, ఉడికుతున్న బాస్మతి రైస్ లో వేసి కలిపి ఉడికించాలి. తర్వాత మరో పదినిముషాలు మూత పెట్టి ఉడికిస్తే పొడి పొడిగా ఘుమ ఘుమ లాడే ఆనియన్ పులావ్ రెడీ...ఈ ఆనియన్ పులావ్ కి ఏదైనా పికెల్ లేదా మీకు నచ్చిన సైడ్ డిష్ తో సర్వ్ చేయాలి. అంతే...

No comments: