డోక్లా అనేది గుజరాతీయుల స్పెషల్ డిష్. దీన్ని ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ కు తయారు చేసుకొని తింటుంటారు. ఇది హెల్తీ మరియు లోక్యాలరీస్ కలిగినటువంటి స్నాక్. బియ్యం, చిక్ పీస్, బేసన్ వంటివి కూడా డోక్లాకు ఉపయోగిస్తుంటారు. అయితే ముఖ్యంగా ఎక్కువగా డోక్లాకు ఉపయోగించేవి పెరుగు, మరియు చెన్నా. చాలా టేస్ట్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఒక సారి ఇంట్లో తయారు చేసి చూడండి. ఇంట్లో ఎవరైనా డైయటీషియన్లు ఉన్నా ఈ లోఫ్యాట్ స్నాక్ చాలా ఆరోగ్యకరం.
కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు(మూంగ్ దాల్): 1cup(రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి)
శెనగపప్పు: 1tbsp
పచ్చిమిర్చి: 4-6
ధనియాలు: 1tsp
పెరుగు: 2tbsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ సోడా: ½ tsp
నూనె: 1tsp
ఫ్రైయింగ్ కోసం
నూనె: 1½ tbsp
ఆవాలు: 1tsp
ఎండు మిర్చి: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 4(finely chopped)
తయారు చేయు విధానం:
1. ముందుగా రాత్రంతా నానబెట్టుకొన్న పెసరపప్పును శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఎక్కువ నీళ్ళు చేర్చకుండి కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకొంటే కొద్దిగా నీళ్ళు చేర్చి రుబ్బుకోవచ్చు.
2. పేస్ట్ చేసుకొన్ని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో శెనగపప్పు, పెరుగు, ధనియాలు, పసుపు, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
3. డోక్లా స్టీమింగ్ పాన్ కు కొద్దిగా నూనె రాసి, అందులో ఈ పెసరపప్పు మిశ్రమాన్ని అందులో పోయాలి. పాన్ నిండుగా పోసి ఒక అంగుళం మందంగా సర్ధాలి.
4. ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి అరగంట పాటు ఉడికించాలి. అదికూడా డబుల్ బాయిలర్ పద్దతిలో ఉడికించాలి. అంటే ఒక డీప్ బాటమ్డ్ పాత్రలో ఒకటి నుండి రెండు అంగులా వరకూ నీళ్ళు పోసి దాని మీదుగా డోక్లాపాన్ పెట్టి ఉడికించాలి.
5. అప్పుడప్పుడు డోక్ల్ ఉడికిందో లేదా చూస్తుండాలి. డోక్లా ఉడికింది అని నిర్థారణ అయిన వెంటనే స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
6. ఇప్పుడు చిన్న ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకొన్న డోక్లాను అందులో కుమ్మరించాలి. అవసం అయితే కొద్దిగా కారం చిలకరించుకోవచ్చు.
రాజస్తానీ స్టైల్లో మూంగ్ దాల్ డోక్లా తినడానికి రెడీ. కావాల్సిన సైజ్ లో కట్ చేయాలి. ఈ లోఫ్యాట్ స్నాక్ ను కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి చింతపండు చిట్నీ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. అంతే...

No comments:
Post a Comment