all

Monday, November 26, 2012

చిటికెలో తయారయ్యే న్యూట్రిషియన్ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ కోతు

సాధారణంగా ఎగ్(గుడ్డుతో)చాలా వెరైటీ వంటలను వండకుంటుంటాం. అందులో ఇదో కొత్తరకం వంట. ఎగ్ కోతు చాలా సులభమైన రుచికరమైన వంట. ఈ స్పైసీ ఎగ్ కోతును ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను తీసుకోవచ్చు. ఉదయం చాలా తక్కువ టైమ్ లో తయారు చేసుకొనే ఒక ఆరోగ్యకరమైన వంట. అంతే కాదు ఇది తయారు చేయడం కూడా సులభం. ఎగ్ కోతుకు వెజిటేబుల్ మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఎగ్ చేర్చడం వల్ల వేరే ఇతర అల్పాహారినికి బదులు ఎగ్ కోతును అల్పాహారంగా తీసుకొంటే సరిపోతుంది. శరీరానికి కావల్సినన్ని న్యూట్రిషియలన్స్ అందుతాయి. దీన్ని ఈవెనింగ్ స్నాక్ గాను తయారు చేసి పిల్లలకు పెద్దలకు పెట్టవచ్చు. ఎగ్ కోతును పరోటాలో స్టఫ్ చేసి కూడా తినవచ్చు. చాలా రుచికరంగా వెరైటీ టేస్ట్ తో ఘుమఘుమలాడుతుంటుంది.
కావలసిన పదార్థాలు:
గుడ్లు: 8
మెంతులు: చిటికెడు
ఆవాలు: 1tsp
ఉల్లిపాయలు: 2-3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
కరివేపాకు : రెండు రెమ్మలు
టమోటో: 2 (చిన్నముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 8 (చిన్నముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
నిమ్మరసం: 3-4 చుక్కలు
బ్లాక్ పెప్పర్ (నల్ల మిరియాల పొడి): 1-2tsp
కొత్తిమీర తరుగు: ½ cup
నూనె: 2-3tbsp
ఉప్పు: రుచికి తగనంత
Egg Kothu Spicy Scrambled Eggs Recipe
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డును పగుల గొట్టి పోయాలి. అందులో కొద్ది ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కొన్ని మెంతులు, ఆవాలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత కరివేపాకు, టమోటో, కూడా వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి. టమోటో మెత్తబడ్డాక, వెంటనే అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, నిమ్మరసం, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద వేయిచుకోవాలి.
4. పోపు బాగా వేగిన తర్వాత గుడ్డు, ఉప్పు మిశ్రమాన్ని కూడా చేర్చి బాగా మిక్స్ చేసి కొద్ది సేపు మీడియం మంట మీద వేయించి, తర్వాత మంటను పూర్తిగా తగ్గించి మద్య మద్యలో కలియబెడుతూ ఫ్రై చేయాలి.
5. చివరగా కొత్తిమీర తరుగును చల్లి మరో రెండు నిముషాలు వేయించి స్టౌ ఆప్ చేసి వేడి వేడి వడ్డించాలి. అంతే ఎగ్ కోతు రెడీ...

No comments: