all

Monday, November 26, 2012

స్టఫ్డ్ ఇడ్లీ - ఫ్యాట్ లెస్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్

సాధారణంగా అల్ఫాహారాల్లో చాలా మంది ఇష్టపడేది... ఇడ్లీ, దోస. ఈ రెండింట్లో కూడా మరీ ఎక్కువగా ఇష్టపడేది ఇడ్లీ. ఎందుకంటే ఇడ్లీ తయారు చేయడం సులభం. నూనె లేకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ భావిస్తారు. ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతగా పనిచేస్తుందంటే.. ఇందులో లోకాలరీసు కలిగి.. అతి తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇడ్లీలు, త్వరగా, సులభంగా జీర్ణం అవుతుంది. దక్షిణ భారత దేశంలో ఇడ్లీతో పాటు సాంబర్, వడ ఫేమస్ కాంబినేషన్. ప్రతి రోజూ ప్లెయిన్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ తో తినడం ఒక్కోసారి బోర్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఇడ్లీను తయారు చేయడంతో రుచితో పాటు ఆరోగ్యం మరియు బోర్ అనిపించదు. అందురూ ఇష్టంగా తింటారు. మరీ వెరైటీగా స్టఫింగ్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం....
faceless healthy breakfast stuffed idly

కావాలసిన పదార్థాలు:
ఇడ్లీ రవ్వ: 2cups
పెరుగు: 1cup
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
బేకింగ్ పౌడర్(వంట సోడ): 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : 1tsp
ఇడ్లీ స్టఫింగ్ కోసం:
బంగాళాదుంప: 1cup(2 ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
పచ్చిబఠాణీ: 1cup(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
కారం: 1tsp
పసుపు: 1tsp
ధనియా పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ మరియు ఉప్పు, పెరుగు వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి బాగా కలిపి రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప, పచ్చిబఠాణి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, అన్ని వేసి బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు వేయించాలి.
3. ఇప్పుడు మరో ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడాక ఇడ్లీ పిండిలో వేయాలి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా చిలకరించి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
4. తర్వాత ఇడ్లీ పాత్రను స్టౌ మీద పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. అంతలోపు ఇడ్లీ ప్లేట్స్ కు కొద్దిగా నూనె రాసి(అవసరమైతేనే)ఇడ్లీ పిండి సగ భాగం మాత్రం పోసి నింపి పెట్టుకోవాలి.
5. తర్వాత స్టఫింగ్ కోసం తయారు చేసి పెట్టకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని స్పూన్ తో ఇడ్లీ పిండి మధ్యలో పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ పిండిని పోయాలి. ఇలా అన్ని ప్లేట్స్ నింపుకొన్న తర్వాత ఇడ్లీ స్టాండ్ ను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి పది నిముసాలు ఉడికించుకోవాలి.
6. పది నిముషాల తర్వాత ఇడ్లీ స్టాండును బయటకు తీసి ఐదు నిముషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇడ్లీలను సపరేట్ చేసి వేడి వేడి సాంబార్, కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి. అంతే స్టఫింగ్ ఇడ్లీ రెడీ.(స్టఫింగ్ కోసం మీరు క్యారెట్, బీన్స్, ఆకుకూరలు, పన్నీర్ వంటివి కూడా వినియోగించవచ్చు.)

No comments: