ముఖ్యంగా బెంగాల్ లో ఎక్కువగా తయారు చేసుకొనే స్వీట్ మీకోసం...
పైనాపిల్ స్వీట్
కావలసిన పదార్థాలు: పైనాపిల్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), నెయ్యి: 3tbsp, కోవా: 2cup(తురుముకోవాలి), పంచదార: 1/2cup, చిరోంజి(సన్ ఫ్లవర్ గింజలు): 1/4cup, యాలకుల పొడి: 1tsp, జీడిపప్పు: 20
తయారు చేయు విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి, తర్వాత అందులో పైనాపిల్ ముక్కలను వేసి ఐదు నిముషాల పాటు వేయించి పూర్తిగా నీరంత పోయేవరకూ వేయించాలి. అందులో పంచదారను కూడా వేసి బాగా కరిగేలా కలియబెడుతు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో మిగిలిన నెయ్యి వేసి అందులో సన్ ఫ్లవర్ గింజలు మరియు జీడిపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించి, పైనాపిల్ మిశ్రమంలో కలుపుకోవాలి. అందులోనే కోవా తురుము కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించి జీడిపప్పును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

బెంగాలి పాయసం
కావలసిన పదార్థాలు: పాలు: 1ltr, బాస్మతి రైస్: గుప్పెడు, నెయ్యి: 2tbsp, యాలకులు: 1tsp, బిర్యాని ఆకు: 1, బెల్లం: రుచికి సరిపడా, గార్నిష్ కోసం: ద్రాక్ష, జీడిపప్పు
తయారు చేయు విధానం: ముందుగా మందపాటి గిన్నెలో పాలపోసి, స్టౌ మీద పెట్టి బాగా కాచి, చిక్కబడిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో బాస్మతి బియ్యం వేసి, లైట్ గా వేయించుకోవాలి. అందులోనే ద్రాక్ష, జీడిపప్పు, బిర్యాని ఆకు యాలకలు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలుపుకోవాలి. తర్వాత బెల్లం తురుమును కూడా కలుపుకోవాలి. బెల్లం బాగా పాలలో కరిపోయేలా కలిపి మరో రెండు నిముషాల స్టౌ మీద పెట్టి ఉడికించాలి. చివరగా అందులో వేయించుకొన్న ద్రాక్ష మరియు జీడిపప్పును గార్నిష్ చేసి పాయసం చల్లబడిన తర్వాత కూల్ గా సర్వ్ చేయాలి.

ఇలాచి బహార్ సందేష్
కావలసిన పదార్థాలు: చీజ్: 250grms, పంచదార: 150grms, యాలకులపొడి: 1tsp, చెర్రీస్ : 5-10
తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో కాటేజ్ చీజ్, మరియు క్యాస్టర్ షుగర్ రెండూ వేసి బాగా మెత్తగా అయ్యేవంతవరకూ కలుపుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో చీజ్, షుగర్ మిశ్రమాన్ని వేసి తడిపోయేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ తయారు చేసిన చీజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న కప్పులలో నింపుకొని దానీ మీద చెర్రీస్ ను గార్నిష్ చేయాలి. అంతే ఇలాచి బహార్ సందేష్ రెడీ...

ఇలాచీ బేసన్ బర్ఫీ
కావలసిన పదార్థాలు: శెనగపిండి: 1kg, కోవా: 1/2kg, పంచదార: 1.5kg, యాలకులు: 4-5, జీడిపప్పు: 5-10, నెయ్యి: 250grms
తయారు చేయు విధానం: ముందుగా శెనగపిండిలో నెయ్యి కలిపి దోరగా వేయించాలి. పంచదారను పాకంపట్టి, తీగపాకం రాగానే వేయించిన శెనగపిండిని, కోవాను వేసి కలియదిప్పాలి. మంట తగ్గించి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం గట్టిపడుతుండగా యాలకులపొడిని కూడా దానికి కలపాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి.. పైన జీడిపప్పులను అద్దాలి. ఇష్టమైనవారు తగరపు రేకులను కూడా అంటించవచ్చు. ఇది ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా చేసి సర్వ్ చేయాలి. అంతే బేసన్ బర్ఫీ తయారైనట్లే...!

కుబానీ కా మీఠా:
కావలసిన పదార్థాలు: ఎండు కుబానీపండ్లు: 1kg, పంచదార: 1.5kg, తాజా మీగడ: 1cup, బాదం:1/2cup, కస్టర్డ్ పౌడర్: కొద్దిగా
తయారు చేయు విధానం: ముందుగా కుబానీ పండ్లను ఓ రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు గింజను వేరుచేసి గుజ్జును మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో పంచదార కలిపి తక్కువ మంటమీద ఉడికించి చిక్కటి పాకంలా అయ్యాక దించాలి. చివరగా దీన్ని ప్లేట్లలో సర్ది పాలమీగడ లేదా కస్టర్డ్, బాదంపప్పుతో అలంకరిస్తే రుచికరమైన కుబానీ కా మీఠా రెడీ..

రసగుల్లా
కావలసిన పదార్థాలు: పాలు: 1tsp, పంచదార: 3cups, మైదాపిండి: 1/4cup, వడకట్టేందుకు మంచి క్లాత్: చిన్న నాప్‌కిన్ సైజులో
తయారు చేయు విధానం: ముందుగా పాలని మరిగించి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే పాలు విరిగి పోతాయి. తర్వాత ఆ విరిగిన పాలని మంచి క్లాత్‌లో వడకట్టాలి. అప్పుడు గట్టిగా తయారై, పనీర్ అవుతుంది. ఈపనీర్‌లో పిడికెడు మైదా పిండివేసి బాగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఆరిపోకుండా తడిబట్టను కప్పి ఉంచాలి. పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పాకం తయారు చేసి, పాకం బాగా ఉడుకుతుండగా పై ఉండలను వేసి తీసేయాలి. ఉండలలోకి పాకం బాగా పట్టి, మిశ్రమం బాగా ఆరిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని రసగుల్లా స్వీట్ తయారైనట్లే...!

No comments:
Post a Comment