all

Monday, November 26, 2012

దీపావళి స్పెషల్ జిల్ జిల్ జిలేబి

చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ. పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే పిండి వంటల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. చుట్లు, చుట్లుగా అందంగా మెరుస్తూ ఉండే తీపి వస్తువేంటి. అది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువేమో..గుర్తొచ్చిందా?? అదేనండి.. జిలేబి. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి ఎలా చేయాలో చూద్దామా.....
Diet Sweet Diwali Jalebi Recipe  Aid0069
కావలసిన పదార్థాలు:
మైదా: 1 1/2cup
పెసర పిండి: 2tbsp
పంచదార(షుగర్ ఫ్రీ): 2tbsp
పంచదార: 3cups
వంట సోడా చిటికెడు
నిమ్మరసం: 1tsp
యాలకుల పొడి 1/2 ts
నెయ్యి లేదా నూనె వేయించడానికి
కేసర్ రంగు చిటికెడు

తయారు చేయు విధానము:

1. మొదటగా మైదా, రెండు టేబుల్ స్పూన్ల పెసర పిండిలో వంటసోడా, ఒక స్పూన్ నెయ్యి, నిమ్మరసం, కేసర్ రంగు వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.
2. పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది.మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కావాలంటే కాస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి.
3. తర్వాత చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి. అందులోనే యాలకులపోడి కలిపాలి.
4. జిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.
5. జిలేబీలను కాస్త దోరగా వేయించి తీసి పాకంలో వేయాలి. పదినిమిషాలతర్వాత తీసి విడి పళ్ళెంలో తీసుకొని కొద్దిసేపు తర్వాత తింటే పాకం అంతా జిలేబిలకు పట్టి, కలర్ ఫుల్ గానే కాదు ఎంతో రుచిగా ఉంటుంది.

No comments: