ఫ్యాషన్ విషయంలో ఫలానా వారిది
గుడ్ టేస్ట్, బ్యాడ్ టేస్ట్ అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ను సరిగ్గా
ఫాలో అవకపోవడమే కాదు తప్పుగా ఫాలో అవడం కూడా అందాన్ని చెడగొడుతుంది అంటున్నారు
సౌందర్య నిపుణులు. సాధారణంగా అతివలు బ్యూటీ విషయంలో చేసే ప్రధానమైన మిస్టేక్స్ ఏంటో
చూద్దాం.. 1. సరిపోలని ముఖం-మెడ మేకప్‌లో ఫౌండేషన్‌ని ముఖానికి
రాసుకుంటారు సరే, మెడ మాటేమిటి?! ఫౌండేషన్ (బ్యూటీ క్రీములు, ఇతర ప్రొడక్ట్స్ కూడా)
ముఖం వరకే వాడి వదిలేయడం వల్ల ముఖం లేత కాంతివంతంగా కనిపించగా, మెడ మాత్రం
డార్క్‌గా కనిపిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ముఖంతో పాటు మెడకూ
ఫౌండేషన్‌ని తప్పనిసరిగా అప్లై చేయాలి.
2. పెదవి అంచున
లిప్ లైనర్పెదవుల అందం కోసం కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటున్న
రోజులివి. పెదవులకు నప్పే షేడ్ లిప్‌స్టిక్ వేసుకోవడంతోనే సరిపెట్టకూడదు. ముందుగా
డార్క్ షేడ్ వచ్చేలా పెదవుల చుట్టూ లిప్‌లైనర్ ఉపయోగించకపోతే మేకప్‌లో ‘అఆ..లు’
తెలియనివారిలా చూపరులకు కనిపిస్తారు. అలాగే పెదవులకు లిప్‌స్టిక్‌ను బాగా
పులిమేస్తే డోస్ ఎక్కువై ఎబ్బెట్టుగా కనిపిస్తారు.
3.
చేతివేళ్లు అందం అంటే అందరూ ముఖంపైనే కాన్‌సన్‌ట్రేషన్ చేస్తారే తప్ప
చేతివేళ్లను, గోళ్లను, పాదాలను ఏ మాత్రం పట్టించుకోరు. వేలి కొసల్లో ఒదిగి ఉండే
గోళ్లు శుభ్రంగా, అందంగా ఉండటం ప్రధానం. అలాగే గోళ్లు పొట్టిగా, పాలిష్ లేకుండా
ఉంటే అల్ట్రా ఉమెన్ అనిపించుకోరు. ఒకసారి మీ గోళ్లను పరిశీలించండి. సరిపోలనట్టుగా
అనిపిస్తే రెడీమేడ్‌గా దొరికే నెయిల్‌క్లిప్పర్‌తో వాటిని నచ్చినట్టుగా
తీర్చిదిద్దుకోవచ్చు.
4. ఆడంబరంఎక్కువ నగలు,
మెరుపులతో చేసుకునే అలంకరణ చూపరులకు ఎప్పుడైనా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
సింపుల్‌గా, క్లాసీగా ఉండేలా తక్కువ నగలతో మేనికి అందాన్ని తీసుకురావచ్చు.
5. ట్యాన్బయటకు వెళ్లేప్పుడు చాలామంది
మరిచిపోయే విషయం ట్యానింగ్. దుమ్ము, ఎండ వల్ల కమిలే చర్మం పట్ల అజాగ్రత్తగా ఉంటారు.
ట్యాన్ అందాన్ని పాడు చేస్తుంది. ఇందుకోసం సెల్ఫ్-ట్యానింగ్ (సన్‌స్క్రీన్ లోషన్
రాసుకోవడం, గొడుగు, స్కార్ప్ వంటివి వాడటం) పద్ధతులను అవలంబించడం
అవసరం.
No comments:
Post a Comment