all

Friday, July 12, 2013

హెయిర్‌ డై వేసుకోవడం వల్ల పొంచిఉన్న అనారోగ్యం?

ఫ్యాషన్‌ పేరుతో జుట్టుకు తరుచుగా రకరకాల రంగులు వేసుకోవడం ఈనాటి యువతులకు అలవాటైపోయింది. ఆహార్యంలో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగే మాట ఏలా ఉన్నా ... అన్ని సమయాలలో జుట్టుకు రంగులు వేయటం అంత మంచిది కాదు. అందుకే ఈనాటి యువతులు ఫ్యాషన్‌కు ఎంతగా ప్రాధాన్యత ఇస్తునప్పటికీ... జుట్టుకు రంగులు వేసుకోవడాన్ని మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయాలి.

లేకపోతే తలకు తరచూ రకరకాల రంగులు వేసుకోవటం వల్ల జుట్టు పొడిబారిపోయే ప్రమాదం పొంచి వుంది.వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్‌‌సలో కెమికల్స్‌ ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్‌ డయిస్‌ లోని కెమికల్స్‌ యమడేంజర్‌ అని తేలిపోయింది. కాబట్టి హెయిర్‌ డై చేయించుకోవాల్నుకున్నపుడు తాస్మాత్‌ జగ్రత్తా...జుట్టు నెరవడం ఓల్డ్‌ ఏజ్‌కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు.

ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్‌ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్‌ డైయిస్‌ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది వాడుతున్న కెమికల్‌ రసాయనాలతో తయారయ్యే హెయిర్‌ డయిస్‌ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.


హెయిర్‌ డయిస్‌ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు సలహాలు పాటించకుండా విచ్చలవిడిగా కెమికల్స్‌ను ఉపయోగిస్తూ ఆనారోగ్యంతో చెలాగాటం అడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ఈ హెయిర్‌ డైస్‌ ద్వారా ఏటా కోట్లాది బిజినెస్‌ జరుగుతుందంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మరి ఇంతటి ప్రమాదకరమైన రసాయనంపై నిషేధం లేదా? ప్రపంచదేశాలు దీన్ని యథేచ్ఛగా ఎందుకు వాడనిస్తున్నాయి ? నిజమే, పిపిడీ అత్యంత ప్రమాదకరమైనదన్న సంగతి తెలుసు. అయినా దీనిపై ఎక్కడా నిషేదం లేదు.

హెయిర్‌ డై వేసుకోవడం వల్ల పొంచిఉన్న అనారోగ్యం?

ఈ రసాయనాన్ని కలర్‌ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ లోనూ, రబ్బర్‌ ఆక్సిడేషన్‌ లోనూ వాడుతున్నారు. జట్టుకు రంగేసుకోవడం ఇప్పుడు ఓ సాధారణమైన చర్యగా మారిపోయింది. సునాయాసంగా కేశాలకు రంగు పట్టించుకునే అవకాశం రావడంతో క్రేజ్‌ పెరిగిపోయింది. జుట్టు రంగు ఏమాత్రం మారినా వెంటనే హెయిర్‌ డై వాడేస్తున్నారు.

పర్మనెంట్ హెయిర్ కలర్ లేదా డై‌లలో పైరాఫినిలేటిడ్ పిపిడి అనబడే రసాయనాన్ని వీటిలో కలుపుతుంటారు. ఈ పిపిడి వలన వెంట్రుకలపై రంగు చాలా రోజులవరకు ఉంటుందనేది వాస్తవం. కాని మీ వెంట్రుకల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వీటివలన చర్మంపై ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. వెంట్రుకలు రాలిపోవడం, కళ్ళు, చెవులు, తలపైనున్న చర్మం, ముఖంపైనున్న చర్మంపై దీని ప్రభావం వుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

కొన్నిసందర్భాలలో పిపిడి రియాక్షన్‌కు కూడా దారితీస్తుంది. దీంతో రియాక్షన్ బారిన పడినవారిని ఆసుపత్రిలో చేర్పించిన సందర్భాలుకూడావున్నాయి.ఓవైపు హైయిర్ కలర్, హెయిర్ డై తయారు చేసే కంపెనీలు హెచ్చరికల ప్రకటన వారిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో పొందుపరిచేవుంటారు. కాని చాలవరకు దీనిని వాడేవారు పెద్దగా పట్టించుకోరు. అలాగే టాటూ లేక కాలీ మెహిందీలో పిపిడి కలిసివుంటుంది. ఇది చాలా హానికారకమైంది.మనం వాడే హెయిర్‌ డైలో విషతుల్యమైన పీపీడీ ఉన్నట్టు ఎలా గుర్తించడం ?

హెయిర్‌ డై ప్యాక్‌ లో రెండు సీసాలున్నాయా ? అయితే, తప్పనిసరిగా అందులో ఒకటి పీపీడీ అయి ఉంటుంది పీపీడీ తెల్లగా ఉండే ద్రావకం.. దీని గురించి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే.. పీపీడీ వల్ల ఆస్తమా రావచ్చు. కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడవ్వొచ్చు. సెలూన్లలో పనిచేసేవారు రోజూ పీపీడీ ఘాటు పీల్చడంవల్ల త్వరలోనే అస్వస్థులు కావచ్చు. అయితే, హెయిర్‌ డయిస్‌ కంపెనీలు మాత్రం తామ ఉత్పత్తుల వల్ల హాని కలగదనే అంటున్నాయి. మరి ఇదే హెయిర్‌ డయిస్‌ లోని రసాయనాలు చేస్తున్న మాయాజాలం మాటేమిటి?

No comments: