సాధారణంగా స్థూలకాయం ఉన్నవారు పొట్ట, నడుం చుట్టూ చేరిన కొవ్వును తగ్గించుకునేందుకు పడరాని కష్టాలు పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొట్టలో కొవ్వు వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినవి, చక్కెర వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. పొట్టలో కొవ్వు చేరడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతుల్యత, అతిగా తినడం, అధికంగా మద్యం తీసుకోవడం, స్వీట్లు, చాకలెట్లు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం. ఇవి కాక కొవ్వు చేరేందుకు ప్రధాన కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ అతిగా విడుదలైనప్పుడు అది పొట్ట చుట్టూ కొవ్వు చేరడాన్ని ఉత్తేజితం చేస్తుంది. మరొక ప్రధాన కారణం జీర్ణ ప్రక్రియ సవ్యంగా లేకపోవడం. జీర్ణ ప్రక్రియ సరిగా లేనప్పుడు వాయు సంబంధిత సమస్యలు వచ్చి పొట్ట ఉబ్బరంగా అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కాలరీలు ఖర్చు చేయడం తగ్గిపోయి పొట్ట చుట్టూ కొవ్వు చేరడం జరుగుతుంది.
రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.
తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.
ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
చాలామందికి కాయగూరలే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ వాటిని ఇష్టంగా తినరు. అటువంటి వారే కూరల్లో కొద్ది ఆలివ్ ఆయిల్ వేసుకుంటే వాటి ఫ్లేవరే కాదు రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు, పొట్ట తగ్గేందుకు దోహదం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్ ఫ్లవర్, గ్రౌండ్ నట్ ఆయిల్స్ తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు
కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.
మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.
గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.
ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి.
మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వౄఎద్ధి చేస్తుంది. కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగినా నూనె వస్తువులు, కొవ్వు, కార్బో హైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్నే తింటూ ఉంటే ఆలోచించవలసిన సమయం ఏర్పడింది. ముందుగా మీరు చేయాల్సింది ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నిద్రించే సమయానికి రెండు మూడు గంటల ముందు తినడం మానుకోవాలి. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాయపడే ఆహారాన్ని తీసుకోవాలి. పొట్ట ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాలసిన ఆహారం ఇది.

No comments:
Post a Comment