కాబట్టి మీ ముఖ చర్మం శుభ్రం చేయడానికి టమోటో క్లెన్సింగ్ ప్యాక్ ను మీకందిస్తున్నాం.. టమోటో ముఖంలో పేరుకొన్న ఆయిల్ ను తొలగిస్తుంది. కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఈ మాస్క్ ను వేసుకోవచ్చు. టమోటో క్లెన్సింగ్ మాస్క్ వేసుకొనే ముందు టమోటోతో అవకాడో చేర్చి మాస్క్ వేసుకోవడం వల్ల చర్మాన్ని శుభ్రం చేసి చర్మానికి కావలసిన తేమను అందించడంలో అవకాడో బాగా పనిచేస్తుంది. అవకాడో మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ క్లెన్సింగ్ మాస్క్ ను అన్ని రకాల చర్మం(ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, నేచురల్ స్కిన్)గలవారు ఉపయోగించవచ్చు.
టమోటో అవకాడో స్కిన్ క్లెన్సింగ్ మాస్క్:
రెండు టమోటోను తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ టమోటో ముక్కలను మిక్సీ జార్ వేయాలి. ఇప్పు అవకాడోను రెండు భాగాలు గా కట్ చేసి అందులో ఒక బాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసికొని టమోటో ముక్కలతో జత చేయాలి. ఈ రెండింటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతే టమోటో క్లెన్సింగ్ మాస్క్ రెడీ..
ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ టమోటో క్లెన్సింగ్ మాస్క్ ను అప్లై చేయాలి. అరగంట పాటు అలా ఉంచేసుకొని, అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే చాలు. ఖచ్చితం మీ ముఖం కాంతివంతంగా ...ప్రకాశవంతంగా మారుతుంది. తాజాగా కనబడుతుంది. అదేవిధంగా మీరు సహజ పద్దతిలో ఫేస్ మాస్క్ వేసుకొన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది.
టమోటోను ఫేస్ ప్యాక్ ను ముఖానికి ప్యాక్ వేయడం వల్ల చర్మం రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం తాజాగా ఉంటుంది. 21-47 వయసు గల మహిళలపై ఈ పరిశోధన చేయబడింది. ఈ పరిశోధనలో టమోటాలు తీసుకునే వారిలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించగల సామర్థ్యం అధికంగా కలదని తెలిసింది.
టమోటోస్ తీసుకునే మహిళల్లో చర్మ రక్షణ పెరిగిందని తేలింది. ఐదు టేబుల్ స్పూన్లు (55గ్రాములు) టమోటా గుజ్జుకు పది గ్రాముల ఆలివ్ ఆయిల్‌ను ప్రతీరోజూ పన్నెండు వారాల పాటు వాడిన 20 మంది మహిళల్లో సాధారణ మహిళల కంటే చర్మ సౌందర్యం 33 శాతం మరింత పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది.
No comments:
Post a Comment