all

Wednesday, November 21, 2012

పర్యావరణానికి దగ్గరగా...కాలుష్యానికి దూరంగా....!

8 Eco Friendly Tips Home Improvement Aid0069
ప్రస్తుత రోజుల్లో జీవన విధానంలో చాలా మార్పులు చేటుచేసుకుంటున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తమ గురించి, తమ ఆరోగ్యం గురించే కాదు తమ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా బిజీ అయిపోతున్నారు. బందాలకు, భాందవ్యాలకు దూరమవుతూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా కనీస అవసరాలను గుర్తించలేక కాలుష్య జీవణాన్ని గడుపుతున్నారు. పర్యావరణాన్ని దూరం చేస్తున్నారు. కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా జీవించాలంటే చాలా కష్టం. చేయడానికి పెద్ద పనే అయినా ఒక్కసారి ఇంటి వాతావరణపరిస్థితులను మార్చుకోగలితే ఆనందం తమ జీవితాల్లో అంతా ఇంతా కాదు..కొన్ని పద్దతులను మొదలు పెట్టాలంటే కూడా డబ్బుతో ముడిపడిఉంటుంది. అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, ఎకో ఫ్రెండ్లీ జీవితాన్ని ఏర్పరచుకోవచ్చు అదెలాగంటే....
1. హాలోజెన్ లాంప్స్ : అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న మార్పులతో చాలా వ్యత్యాసంతో ఇల్లు అందంగా కనిపిస్తుంది. రొటీన్ కి బిన్నంగా ఇంట్లోని లైట్ బల్బ్ లకు బదులుగా హాలోజన్ లాప్స్ ను వినియోగిస్తే ఇంటి కళే మారిపోతుంది. దాంతో కరెంట్ సేవ్, మనీ సేవ్ చేసినట్లు ఉంటుంది. వేస్ట్ మెటిరీయల్స్ తోటి ఎక్కువ కాలం హాలోజన్ లాప్స్ ను వినియోగించుకోవచ్చు.
2. కొత్తగా, ఆహ్లాదంగా కనిపించడానికి బాంత్ రూంలో బ్యాంబూ లవల్స్ ను వినియోగించడం మొదలు పెట్టండి. రంగురంగుల బ్యాంబు టవల్స్ వినియోగం వల్ల బ్యాంబు టవల్స్ సున్నితంగా ఉండటమే కాకుండా తడి త్వరగా పీల్చే స్వభావం కలిగి ఉంటాయి. దాంతో కొత్త దనంతో పాటు ఆనందాగా ఉంటుంది.
3. లివింగ్ రూం అందంగా కనిపించాలంటే ఎకో ఫ్రెండ్లీ ఫర్నీచర్ ను వినియోగించాలి. గ్రీన్ మెటిరీయల్స్ తో తయారైనటువంటి ఫర్నీచర్ ను ఎంపికచేసుకోవాలి. గ్రీన్ కర్టెన్స్, అరెంజ్ చేసుకొన్నట్లైతే పచ్చని వాతావరణానికి దగ్గరగా అనిపిస్తుంది.
4. ప్రస్తుతం కిచెన్ కుక్ వేర్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ తోటే వంటగదిలోని ఉపకరణాలను, ఫర్నీచర్ ను కూడా తయారు చేస్తున్నారు.
5. ఎనర్జీ సేవ్ చేసేటటువంటి ఉపకరణాలను ఎక్కువగా వినియోగించడం మంచిది. ఎప్పుడైనా ఏదైనా(వాషర్, డ్రయ్యర్, ఫ్రిజ్)వంటి ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసేవిధంగా ఉన్నటివి ఎంపిక చేసుకోవాలి. దాంతో వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించి కరెంటును ఆదాచేసిన వారవుతారు.
6. ఎప్పుడు నేచ్యురల్ వాతావరణంలో గడపడానికి అలవాటు పడండి. దాంతో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఎక్కువ లైట్స్ వెలుతుర్లులో చదవడం కంటే వర్క్ చేసే ప్రదేశం కానీ, చదువుకునే టేబుల్స్ విండోస్ కి దగ్గరగా అరేంజ్ చేసుకోవాలి.
7. ఇంట్లో అందంతో పాటు ఆకర్షణ కలిగించే విధంగా వస్తువులను సర్ధుకోవాలి. గ్లాస్, బాటిల్స్, క్యాన్స్, కార్డ్ బోర్డ్స్ వంటి అన్నీ ఒక్కదగ్గర అమర్చుకోవాలి.
8. ముఖ్యంగా యుపివిసి డోర్స్, విండోస్ ను అమర్చుకోవడం వల్ల కరెంట్ ఆదాచేసుకోవచ్చు.
    


 
 
 
 
 

No comments: