ప్రతి రోజూ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పండ్లలో ఉన్న విటమిన్స్ మరయు మినిరల్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అటువంటివి కొన్ని మీకోసం.....
1. విటమిన్ సి: కురుల పెరుగుదలకు బయోప్లెవనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణను అంధించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీరు తినేటటువంటి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రికాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.
2. బీటా కెరోటీన్: శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మార్చి శరీరానికి అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను)సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ క్యాన్టలూపే(దోసకాయలో)అధికంగా ఉంటుంది.
3. ఫోలిక్ ఆసిడ్: ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా అంటే విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురుకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
4. విటమిన్ ఇ : విటమిన్ ఇ వల్ల తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణకు కావల్సినంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు మామిడి పండ్లు, కివి పండ్లు రెండూ అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉండి. కురుకు పెరగడానికి దోహదం చేస్తుంది.
5. మెగ్నీషియం: మెగ్నీషియం కూడా ఆరోగ్యకరమైన కురుల పెరుగుదలకు బాగా దోహదపడుతుంది. అందుకు అరటి పండులో కావల్సినన్ని మినిరల్స్ అందుతాయి. తర్వాత అత్తిపండ్లు మరియు ఆర్టిచోక్స్ లో కూడా అధికంగా మెగ్నీషియం ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
6. ఇన్ అసిటోల్: విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. దీని తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా ఉండేటటువంటి దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడం మంచిది.
No comments:
Post a Comment