ఇది శీతాకాలం.. మన గార్డెన్ లో ఏదైనా కొత్తగా మొక్కలు నాటుకొని గర్డెన్ అంతా పచ్చగా ఉండేలా చేయాలనిపిస్తుంది. శీతాకాలంలో చాలా రకాల పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు కావలసినంత నీరు, తేమ లభిస్తుంది కాబట్టి, ఈ సీజన్ లో మొక్కలను నాటుకోవడం మంచిది. మొక్కలు పెంచడం ఒక కళ. కొంత సమయాన్ని, మరికొంత పరిశ్రమనుజోడిస్తే ఆ కళలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఇంటి ఆవరణలో చక్కటి తోటను పెంచవచ్చు. గార్డెన్‌ను చక్కగా మెయింటెయిన్ చేస్తే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. తాజా గాలిని, పూల పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.
పచ్చిబఠానీ మొక్కలు బాగా పెరగడానికి ఇదొక మంచి సీజన్. అందుకు మట్టిని బాగా తవ్వి అందులో గింజలను నాటాలి. లేదా బఠానీలను ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజూ తడి వస్త్రంలో గట్టిగా చుట్టిపెడితే మొలకలు వచ్చిన తర్వాత కూడా భూమిలోపల చల్లుకోవచ్చు. బఠానీలె వివిధ రకాలుగా వండుకొని తింటారు.
రోజంతా ఎన్ని ఒత్తిడులకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో పెరిగిన కూరగాయలతో తాజాగా, రుచికరమైన భోజనం కూడా చేయవచ్చు. ఇంటి ఆవరణలో ఏడాదిలో ఏ కాలంలోనైనా సూర్యరశ్మి, గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గింజలు లేదా మొక్కలను సిద్ధం చేసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కలను కొనడం కంటే మనమే గింజలు చల్లి నారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. గింజలు చల్లాల్సిన సీజన్‌లో సాధ్యం కాకపోయినా, చల్లిన గింజలు సరిగా మొలవక పోతే అప్పుడు నేరుగా మొక్కలను తెచ్చుకోవచ్చు.
మొక్కను నాటే ముందు చెట్టు వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా, రాళ్లను తొలగించి మట్టిని గుల్లబరిచి, నేలను చదును చేయాలి. పై పొరలో ఆకులు, గడ్డి నింపాలి. ఇది నీరు ఎక్కువ - తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నిరోధిస్తుంది. ఈ పొర భూమిలోని అదనపు తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది. గింజలు చల్లిన నేలను నీటితో నింపకుండా, ప్రతిరోజూ కాస్త నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొక్కల మొదళ్లకు మాత్రం నీటిని సరిపెట్టకుండా ఆకుల మీద కూడా చల్లాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.. ముఖ్యంగా శీతాకాలంలో ఇంటి దగ్గర పెంచుకొనే కొన్ని కూరగాయల మొక్కల గురించి తెలుసుకుందాం..
శీతాకాలంలో అతి సులభంగా పెరిగే మొక్క. మార్కెట్లో దీని ఖరీదు కూడా ఎక్కువే. అటువంటి మొక్కను మన ఇంటి గార్డెన్ లో పెంచుకోవడం డబ్బుకు డబ్బు ఆదా.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎక్కువ డబ్బు ఖర్చుచేయకుండా, రసాయనాలు వాడకుండా మనమే స్వీయంగా పెంచుకోవచ్చు. నాన్యమైన విత్తనాలు తెచ్చి ఒక చిన్న ట్రేలో చల్లుకొన్నా సరిపోతుంది.
స్ప్రింగ్ క్యాబేజ్ అతి సులభంగా ఇంటి ఆవరణంలో పెంచుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజీ మొక్కలు నాటేటప్పుడు మొక్కకు మొక్కకు కొంచె దూరం ఉండాలి. క్యాబేజీ పెరిగే కొద్దీ పెద్దగా విచ్చుకుంటుంది. క్యాబేజీ మొక్కలకు పూర్తి సూర్య రశ్మి పడేవిధంగా చూసుకోవాలి. అయితే ఎక్కువ వేడి తగలకుండా చూసుకోవాలి.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వింటర్ సీజన్ లో పెరుగుతాయి. ఇవి అతి త్వరగా పెరుగుతాయి. విత్తనాలను కుంపట్లో చల్లకొన్న సరే మూడు నాలుగు వారాలకంతా మొక్కలు బాగా మొలకెత్తి అతి త్వరగా పెరుగుతాయి. అయితే ఆకు కూరల మీదు క్రిముకీటకాలు ఎక్కువగా వ్యాపిస్తాయి కాబట్టి, చీడపట్టకుండా తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం.
చిన్న ఉల్లిపాయలు వంటకాలు ఉపయోగిస్తే ఎంత రుచికరంగా ఉంటాయో అందరికీ తెలిసి విషయమే. రుచి మాత్రమే కాదు వాసన కూడా ఘాటుగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలను పూర్తిగా ఏర్పడే వరకూ లాగకూడదు. లేదంటే రుచి కాస్త స్వీట్ గా ఉంటుంది. వీటికి వారానికి ఒక సారి నీరు పోస్తే సరిపోతుంది. ఈ ఐదు వింటర్ లో పెరిగే వెజిటేబుల్స్. మరి మీ గార్డెన్ లో ఇతర మొక్కలతో పాటు వీటిని కూడా పెంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వీటితో పాటు ఇంకా కొత్తిమీర, క్యారెట్, బీట్ రూట్, టమోటో, వెల్లుల్లి, అల్లం వంటివి కూడా శీతాకాలంలో ఇంట్లోనే కుంపట్లలో పెంచుకోవచ్చు.

No comments:
Post a Comment