all

Wednesday, November 21, 2012

అందంగా కనిపించాలంటే అసలు జుట్టు ఉండాలి కదా...!

కురులను సంరక్షించుకోవడంలో కొన్ని చేయాల్సిన మంచి పద్దతులున్నాయి. అలాగే కురులకు సంబంధించి కొన్ని చేయకూడనివి ఉన్నాయి. కురులు అందం వయస్సుతో సంబంధంలేదు. అన్ని వయస్సుల వారికి కురుల సంరక్షణ అవసరం. టీనేజ్ గర్ల్స్ దగ్గర నుండి గ్రాడ్ మదర్ వరకూ కేశసౌందర్య అవసరం. హెయిర్ ఫాల్ అనేది మీ మొదటి రుతుచక్రం నుండి మీరు మోనోపాజ్ దశ చేరే వరకూ జుట్టు రాలడం పై పెద్ద ప్రభావం ఉండదు. అంతగా రాలుతున్నాయంటే అందుకు వాతావరణంలో మార్పులు, శరీరంలో మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారం కారణమనే చెప్పాలి. మనం ఇప్పటి వరకూ కేశ సంరక్షించుకోవడానికి చాలా చిట్కాలను చదివాం. అయితే ఇప్పుడు కురులను ఏం చేయకూడదు అనేవాటి మీదు కొన్ని చిట్కాలు మీకోసం..
15 Things Not Do Your Hair

1. ప్రతి రోజూ తలస్నానానికి యాంటి డాండ్రఫ్ షాంపూను ఉపయోగించకూడదు. ముఖ్యంగా కెమికల్స్ తో తయారైనటువంటి షాంపూలను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంది.
2. సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది హెయిర్ స్టైల్ కోసమనో, లేదా వైట్ హెయిర్ కప్పిపుచ్చడానికనో కృత్రిమ రంగుల(హెయిర్ డైలను)సంవత్సరాంతం ఉపయోగిస్తుంటారు. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి ప్రస్తుతానికి అందాన్ని చేకూర్చినా తర్వాత దాని దుష్ర్పభావం కేశాలపై ఎక్కువగా చూపిస్తుంది.
3. హెయిర్ స్టైల్ కోసం కలరింగ్, హెయిర్ కట్స్ ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ కలరింగ్ మరియు స్ట్రెయిట్ హెయిర్ రెండూ ఒకేసారి, ఒకే సమయంలో చేయించకూడదు. ఈ రెండూ చేయించుకోనెందు రెండింటి మధ్య కురులకు కొంత విశ్రాంతి అవసరం.
4. ముఖ్యంగా తలస్నానం చేసినప్పుడు దువ్వెనతో రఫ్(దురుసు) గా దువ్వకూడదు. తడిసిన జుట్టును మళ్ళీ మళ్ళీ దువ్వకూడదు. ఓపికతో ఉండటం వల్ల ఒత్తిడి తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు.
5. కొన్ని రకాలైనటువంటి హెయిర్ ప్యాక్ లను వెంట వెంటనే వేయడం కాని, లేదా రెండు రకాలైనటు వంటి హెయిర్ ప్యాక్ లను మిక్స్ చేసి వేసుకోవడం లాంటివి చేయకూడదు. దాంతో కురుల ఆరోగ్యంపై తీవ్రమైన మార్పులను కలిగిస్తుంది.
6. హెయిర్ స్టైల్ కోసం ఎక్కువగా హెయిర్ జెల్స్ ను ఉపయోగింస్తుంటారు. వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెయిర్ స్ట్రెయిటనింగ్ జెల్స్ కు దూరంగా ఉండటమే మంచిది
.
7. హెయిర్ సన్ స్ర్కీఉత్తమమైన పద్దతి.
8. జుట్టు రాలే సమస్య ఉన్నవారు రఫ్ గా ఉన్న దువ్వెనెలను వాడకుండా టూత్ బ్రెష్ లా సున్నితంగా ఉన్న దువ్వెనెలను ఉపయోగించాలి. కురుల పరిమాణంను బట్టి చిన్న పెద్ద బ్రష్ లను ఉపయోగించాలి. ఇతరుల తల కండిషన్ తెలియకుండా వారి దువ్వెనులను వాడకూడదు. మీరు మీ దువ్వెనలను షేర్ చేసుకోకూడదు.
9. ఒక వేళ సోరియాసిస్ లేదా చుండ్రు కలిగి ఉన్నట్లైతే తలకు నూనె పెట్టకూడదు. నూనె చుండ్రుకు సోరియాసిస్ కు కారణమైయ్యే మలాసెజియా ఈస్ట్ (ఇది ఒక రకమైనటువంటి జీవి అనే చెప్పచ్చు)ఆహారం వంటిది ఆయిల్. ఆయిల్ ను రాసుకోవడం వల్ల చుండ్రు అధికమౌతుంది. దాంతో దురద, పేను కొరుకుడు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
10. కురులు పొడవుగా ఉన్నప్పుడు..ఎప్పుడూ కురులను టైట్ గా ముడిపెట్టడం కానీ, లేదా టైట్ గా హెయిర్ బ్యాండ్స్ తో కురులను బంధించడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల కురులకు తెగిపోవడం లేదా రాలిపోవడం వంటివి జరుగుతాయి.
11. ఒకే రకమైనటువంటి షాంపూను నెలల తరబడి ఉపయోగించకుండి కొన్ని నెలల తర్వాత షాంపూ బ్రాండ్ ను మార్చుతుండాలి.
12. పొడి జుట్టును లాగడం, ఎలా పడితే అలా రుద్దడం, విదిలించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వెంట్రుకలు మధ్యలో తెగిపోవడానికి అవకాశం ఉంది.
13. కేశ సంరక్షణలో కొత్తగా ఏదేని పదార్థాలను ఉపయోగించాలనుకొన్నప్పుడు నిఫుణుల సలహా మేరకు మాత్రమే
ఉపయోగించాలి.
14. అతి చిన్న వయస్సులోనే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోకూడదు. మరీ ఎక్కువగా బట్టతల ఉన్నట్లైతే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బదులు హెయిర్ లైన్ రిస్టోరేషన్(కురులను సహజంగా పెంచుకోవడం) కోసం ప్రయత్నించండి
15. తడిగా ఉన్న వెంట్రుకలను ముడి వేయకూడదు. తడిగా ఉన్నప్పుడు ముడివేయడం వల్ల బలహీనపడుతాయి. మరియు జుట్టు రాలడానికి దారితీస్తుంది.న్ లోషన్లను ఉపయోగించడం పూర్తిగా తగ్గించాలి. వాటి స్థానంలో హెయిర్ కండిషనర్స్ ను ఉపయోగించడం

No comments: