all

Wednesday, November 21, 2012

ఛాట్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

సిటీ లైఫ్ కి అలవాటు పడ్డవారు రోడ్డుపక్కనే ఛాట్ తినేస్తుంటారు. ఫ్రూట్ జ్యూస్ తాగేస్తుంటారు. చైనీస్ ఫుడ్స్ సంగతి సరేసరి. అయితే, ఇలాంటివి లాగించేయడం వల్ల రోగాలు కొనితెచ్చుకోవడమే అవుతుందా? అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. రోడ్డు పక్కన చైనీస్ ఫుడ్ లేదా ఛాట్ ఘుమఘుమలు ముక్కుకు తాకగానే అటుగావెళ్ళి ఫాస్ట్ ఫుడ్ లాగించేయాలని ఎవరికి అనిపించదు. అయితే, అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. రోడ్డు పక్క ఛాట్ తో రోగాలొచ్చే ఛాన్స్ అధికంగా వుంది.
ఈమధ్య ముంబయిలోని ఐఐటీ క్యాంపస్ క్యాంటీన్ లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 600 మంది విద్యార్థులు అనారోగ్యంపాలయ్యారు. దీంతో కాలేజీ క్యాంటిన్ల పరిశుభ్రత పెద్ద చర్చనీయాంశమైంది. కాలేజీలు, ఆఫీస్ ల్లోని క్యాంటిన్లు చాలా చోట్ల అపరిశుభ్రంగానే ఉంటున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఆహారపదార్ధాలను సరిగా వండకపోవడం, లేదా, సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోవడం, వంటకు ఉపయోగించే నీరు పరిశుభ్రమైనది కాకపోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. నీటివల్ల వ్యాపించే రోగాలకు క్యాంటీన్ నిర్వాహకులే పరోక్షంగా కారణమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?



కూరగాయలను బాగా కడగాలి

ఉపయోగించే నీరు పరిశుభ్రంగా ఉండాలి

ఫ్రిజ్ లోనుంచి తీసిన చికెన్ ను 600 డిగ్రీల సెల్సియస్ దాకా ఉడకబెట్టాలి

అనేక కంపెనీల్లోనూ, కాలేజీల్లోని క్యాంటీన్లలో, సబ్సిడీ రేట్లకే ఫుడ్స్ అమ్ముతుంటారు. దీంతో ఎక్కువ మంది క్యాంటీన్లమీదనే ఆధారపడుతుంటారు. ఎక్కువ మంది తరచూ అస్వస్థులు కావడానికి ఇది కూడా ఒక కారణమని తాజా సర్వేలు తేల్చిచెప్పాయి. మరి మనజాగ్రత్తలో మనముండాల్సిందే.

No comments: