ఇలా చేయడం వల్ల పగిలి పైకి లేచిన డెడ్‌స్కిన్ రాలిపోతుంది. తర్వాత మెత్తటి బ్రష్‌తో వైబ్రేషన్ తీసుకోవాలి. ఫుట్ మసాజర్‌లో గోరువెచ్చని నీటిని పోసి స్విచ్ ఆన్ చేయాలి. రెండు కాళ్లను ఫుట్‌మసాజర్‌లో ఉంచాలి. ఇపుడు వైబ్రేషన్ నిదానంగా అరికాళ్ల దగ్గరనుంచి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇలా 20 నిమిషాలపాటు తీసుకుంటే తలదాకా వస్తుంది. ఈ వైబ్రేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అరికాళ్ల మంటలు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
అరికాళ్లలో ఉండే ఆనెలు కూడా మెత్తబడి తగ్గుతాయి. ఈ ఫుట్‌మసాజర్‌తో రెగ్యులర్‌గా వైబ్రేషన్ తీసుకంటే కాళ్లు, పాదాలు మంచి షేప్‌కు వస్తాయి.ఫుట్ మసాజర్ లేనివారు నరిషింగ్ క్రీమును తీసుకుని కాళ్లకురా సుకోవాలి. ప్రతిరోజూ మంచి వేగంలో కూడిన నడక 30నిమిషాలపాటు అయినా ఉండాలి. ఇందువల్ల పాదాలకే కాక శరీరం మొత్తానికి కూడా మంచి వ్యాయామం అవుతుంది.
పెడిక్యూర్ వల్ల పగుళ్లు, దురద రాకుండా ఉంటాయి. సాల్ట్ కాళ్ల నొప్పులను నివారిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ / డెటాల్ పగుళ్లలోపల ఉన్న మురికిని తొలగిస్తాయి. నిమ్మచెక్క, గ్లిజరిన్ వల్ల టాన్‌మారిన పాదాలు తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటాయి. చలికాలంలో రోజంతా సాక్స్ వేసుకుని ఉండటం మంచిది.
అలాగే క్రమబద్ధమైన వ్యాయామం కాళ్ళ కండరాలను, నరాలను బలిష్టంగా చేస్తుంది. కాళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. రోజుకి రెండుసార్లు పదినిమిషాల సేపు కొన్ని రోజులపాటు సాధారణ వ్యాయామం చేస్తే కాళ్ళు బలిష్టంగా తయారవుతాయి.
కాలివేళ్ళను పెకెత్తి నిలబడి మడమల్ని బాగా పైకెత్తి తర్వాత పాదాల్ని పూర్తిగా నేలకి ఆన్చాలి. ఇలా చాలాసార్లు చేయండి. కాలి వేళ్ళను బాగా వాటంతటవే అతుక్కునేట్లు చేసి మళ్లీ విడదీయండి. దీన్ని కూడా వీలైనన్ని సార్లు చేయండి.
ఈ పెడిక్యూర్‌ను 15రోజులకు ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. రాత్రిపూట పడుకునేముందు ఏదైనా క్రీమును కాని ఆయిల్ కాని తీసుకుని కాళ్లకు మసాజ్ చేసిన తరువాత గ్లిజరిన్ రాసుకోవాలి.
[ మీ వ్యాఖ్య రాయండి ]