హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, జుట్టు చివర్లు చిట్లడం, లో హెయిర్ గ్రోత్ ఇవన్నీ మనం వింటున్న సాధారణంగా జుట్టు సమస్యలు. అయితే ఈ సమస్యలు మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడాలో హెయిర్ క్వాలిటీ మరియు ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ జుట్టు సమస్యలకు దారితీస్తున్నదేమిటి? సమతుల ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్య జీవన విధానం, జుట్టుపై సరయైన సంరక్షణ తీసుకోకపోవడం మరియు కాలుష్యం వంటి కొన్ని కారణాల చేత కూడా ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు.
అందుకు ఖరీదైన స్పాల చుట్టూ తిరగడం కంటే ఇంట్లోనే కొన్ని సహజ పద్ధతులను పాటించి జుట్టును కాపాడుకోవచ్చు. ఎక్కువగా నీరు తాగడం, బలహీనమైన ఆహారం తీసుకోవడం కంటే ఫ్రూట్ హెయిర్ మాస్క్ లను ఉపయోగించి చూడండి. సహజమైనటువంటి, మెరిసెటి మెత్తని జుట్టు మీ సొంతం అవుతుంది.
అందుకు ఖరీదైన స్పాల చుట్టూ తిరగడం కంటే ఇంట్లోనే కొన్ని సహజ పద్ధతులను పాటించి జుట్టును కాపాడుకోవచ్చు. ఎక్కువగా నీరు తాగడం, బలహీనమైన ఆహారం తీసుకోవడం కంటే ఫ్రూట్ హెయిర్ మాస్క్ లను ఉపయోగించి చూడండి. సహజమైనటువంటి, మెరిసెటి మెత్తని జుట్టు మీ సొంతం అవుతుంది.
అరటిపండు మరియు పెరుగుతో మాస్క్
హెయిర్ డ్యామేజ్ కు, హెయిర్ ఫ్యాల్, నిర్జీవమైన జుట్టుకు అరటి పండు చాలా అద్భుతంగా ప్రభావితం చూపిస్తుంది. ఇవి చాలా చౌకగా దొరికేటటువంటి ఇంట్లో ఎప్పుడూ సాధారణంగా ఉపయోగించే వీటితో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకోని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. బాగా పండిన అరటి పండును చిదిమి(జుట్టు పొడవును బట్టి) అందులో కొద్దిగా పెరుగు మరియు నిమ్మరసం, వేసి బాగా పేస్ట్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో, మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. దాంతో కురులు మెరుస్తూ, సున్నితంగా పట్టుకుచ్చులా తయారవుతాయి.
జామ మరియు తేనె హెయిర్ మాస్క్
ఇది మరొక అద్భుతమైన హెయిర్ మాస్క్. తేనె కురులకు మంచి మెరుపు నివ్వడమే కాకుండా కురులను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఇక జామకాయలోని విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు కూడా అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. విటమిన్ ఎ కొత్తగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. బాగా పండిని జామపండును తీసుకొని మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం(చుండ్రు ఉంటేనే) కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించి పదిహేను నిముషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
బొప్పాయి మరియు పాలు
బాగా పండిన బొప్పాయి కురుల సంరక్షణకు మరియు చర్మ సంరక్షణకు అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. అటువంటి గుణాలు బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి తేనె కూడా చేర్చి హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి తలకు, కురులకు బాగా పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
స్ట్రాబెర్రీ మరియు నిమ్మరసం
ఇదికూడా మంచిఫలితాలనిచ్చే హెయిర్ మాస్క్. ముఖ్యంగా చుండ్రు, తలలో దురద, జిడ్డు వెంట్రుకలు, తలలో ఒకరకమైనటువంటి దుర్వాసన, జుట్టు రాలడం మొదలైన జుట్టు సమస్యలను అతి సులభంగా తొలగిస్తుంది. కొన్ని బాగా పండిన స్ట్రాబెర్రీలను తీసుకొని మెత్తగా చేసి అందులో తేనె మరియు పాలు, నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
పీచెస్ మరియు పెరుగు హెయిర్ మాస్క్
పొడిబారిన జుట్టు, మరియు దురద వంటి సమస్యలను అతిసులభంగా పోగొట్టే హోం మేడ్ హెయిర్ ఫ్రూట్ మాస్క్. పీచెస్ ను బాగా చిదిమి పెట్టుకొని అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.
No comments:
Post a Comment