ఆమె మలయాళీ ముద్దుగుమ్మ. అతని జన్మస్థలం కర్నాటక.
ఆ ఇద్దరినీ కలిపింది తెలుగు సినిమా. వారే ఊహాశ్రీకాంత్‌లు.
రంగుల ప్రపంచం నుంచి రంగవల్లిగా మార్చుకున్న వీరి వైవాహిక బంధం వయసు పదహారేళ్లు. భర్తకోసం తెలుగుతో పాటు తెలుగింటి పద్ధతులనూ ఒంటపట్టించుకున్న భార్యామణి ఊహ. శ్రీమతి కోసం మలయాళీ భాషను ఇప్పటికీ అవస్థపడుతూ నేర్చుకుంటున్న భర్త శ్రీకాంత్. వీరిద్దరి దాంపత్యవిశేషాల మాలికే నేటి బెటర్‌హాఫ్...
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వారి సొంతింటిలో కలిసినప్పుడు ఊహ-శ్రీకాంత్‌ల ‘ఆహ్వానం’ చిరునవ్వుల పలకరింపుల మధ్య అందుకున్నాం.
ఇరువైపులా ‘హలో ఐ లవ్యూ....’
‘‘మాది పెద్దలు అరేంజ్ చేసిన ప్రేమ వివాహం’’ అన్నారు ఊహ ఉరఫ్ ఉమామహేశ్వరి. శ్రీకాంత్ ఆ మాటలను అందుకుంటూ ‘‘మా పరిచయం ‘ఆమె’ సినిమాతో మొదలైంది. ఒకరినొకరం ఇష్టపడుతున్న విషయం మా ఇరువైపు పెద్దలకూ చూచాయగా తెలుసు. ఒకరోజు వాళ్లింటికి వెళ్లి వాళ్ల అమ్మనాన్నలతో మా పెళ్లి విషయం డెరైక్ట్‌గా మాట్లాడాను. ఆ సమయంలో తనను పూజ గది ముందుకు రమ్మన్నాను. తను రాగానే వేలికి ఉంగరం తొడిగాను’’ అని శ్రీకాంత్ చెబుతుంటే... ‘‘నాకైతే చమటలు పట్టేశాయండీ... అంత షాక్ అయ్యాను ఈయన చేసిన పనికి. ఇంట్లో అందరూ తేరుకున్నాక ఇరువైపు పెద్దలు మాట్లాడుకున్నారు. అలా 1997లో మా పెళ్లి జరిగింది’’ అని చెప్పారు ఊహ. పెళ్లినాటి ఆ విషయాలు చెబుతున్నంత సేపు ఈ దంపతుల నవ్వులు వారింటి హోమ్‌థియేటర్ గదిలో మార్మోగుతూనే ఉన్నాయి.
అనురాగాల ‘ఊయల’
అత్తంటిలో కోడలు కూతురిలా ప్రేమానురాగాలతో అల్లుకుపోవాలి... అల్లుడు కొడుకులా అత్తవారింటితో బాంధవ్యాన్ని పెంచుకోవాలి. ఆ మాటలకు నిజమైన అర్థం ఈ దంపతులనిపించింది. ‘‘మా పేరెంట్స్ దగ్గర సూపర్బ్ మార్క్‌లు కొట్టేశారు. వారికి ఈయన కొడుకు అయిపో

వారికి ఈయన కొడుకు అయిపోయారనుకోండి. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా ఈయన్ని సంప్రదించనిదే ఇంచుకూడా కదపరు’’ అని ఊహ అంటుంటే ..‘‘ అలా చెబుతోంది కాని, తను నాకన్నా ఎక్కువ మార్కులే కొట్టేసిందండి. మా పెళ్లయిన పదహారేళ్లలో మా అమ్మనాన్న నా గురించి పట్టించుకున్నదే తక్కువ. అస్తమానూ వారి నోట ‘ఉమ’ పేరే వస్తుంది. తను అమ్మగారింటికి వె ళ్లినా సరే, సాయంకాలానికి ‘ఇల్లంతా బోసిపోయింది... ఎప్పుడొస్తావు’ అంటూ ఈవిడకే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తుంటారు’’ అన్నారు శ్రీకాంత్. వీరి ప్రాంతాలు వేరు, భాషలు వేరు, పద్ధతులూ వేరు. అయినా తమ భావం ఒకటే అంటారు ఈ దంపతులు. అందుకే ఒకరి పద్ధతులను ఒకరు నేర్చుకున్నారు. ఊహ మన భాషను నేర్చుకోవడమే కాదు, ఇక్కడి పద్ధతులనూ అనుసరిస్తుంటుంది. అయితే పుట్టింటి పద్ధతలు చాలా వరకు మర్చిపోయాను అని చెబుతూనే ఇరువైపు పండగలన్నీ ఘనంగా జరుపుకుంటామన్నారు ఊహ.
‘ఆయనగారు’తో అనుబంధం... పెళ్లయ్యాక శ్రీవారు తన కెరియర్‌కి ఓకే చెప్పినా తను మాత్రం ‘ససేమిరా’ అన్నారట ఊహ. ‘‘కుటుంబాన్ని మించినది ఏమీ లేదని నా అభిప్రాయం. ఎప్పుడైతే పెళ్లి అనుకున్నామో, అప్పుడే సినిమాలకు పుల్‌స్టాఫ్ పెట్టేయాలనుకున్నాను. మా అమ్మనాన్నలకు ఒక్కదాన్నే. కాని మా నాన్న తోడ ఏడుగురు, అమ్మతోడ ఐదుగురు తోబుట్టువులు. వారి కుటుంబాలు, అనుబంధాలు చూసిన నేను వారిందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అవన్నీ నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడ్డాయి’’ అని ఊహ చెబుతుంటే కుటుంబ ప్రాధాన్యాలు మూలా ల నుంచే బలంగా ఉంటాయనిపించింది. ‘గిల్లికజ్జాల’ వైనం... భార్యాభర్తలన్నాక అలకలు, గొడవలు, మాటపట్టింపులు లేకపోతే మజాయే ఉండదంటారు ఈ దంపతులు. అన్నింటిలో సఖ్యంగా ఉండే వీళ్లు ఒక్క పిల్లల విషయమే తమిద్దరిమధ్య గొడవలకు కారణం అవుతుంటాయన్నారు. ‘‘మాకు ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. వారి బాగోగులు, చదువులు.. అన్నీ తనే చూసుకుంటుంది. ఆ విషయాల్లో నా జోక్యం తక్కువే’’ అన్నారు శ్రీకాంత్. ‘‘నేను చదవుకున్నది చాలా తక్కువ. అందుకే నా పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ. అందుకే చదువు విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. ఇక్కడే మా ఇద్దరికి గొడవలు. తండ్రి బాధ్యతగా పిల్లల దగ్గర కూర్చొని, వారి పుస్తకాలు తీసి ‘ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో’ కనుక్కోమని చెబుతుంటాను. కాని ఈయన పట్టించుకోరు. కాస్త తీరిక దొరికిన సమయాల్లో అయినా చెప్తారా అంటే, చెప్పక పోగా పిల్లలను షికార్లకు తీసుకెళతారు. వారి నోటి నుంచి ఏది వస్తే అది వెంటనే అరేంజ్ చేసేస్తారు’’ అని ఊహ కంప్లైంట్ చేస్తుంటే ‘‘ఒకవైపు స్ట్రెస్ చాలు కదా! మళ్లీ నేను కూడా ఎందుకు వాళ్లని భయపెట్టడం’’ అంటూనే తన శ్రీమతి తల్లిగా పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందో వివరించారు శ్రీకాంత్. ‘‘ప్రతిరోజూ స్వయంగా తనే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. స్కూల్లో జరిగే ప్రతి సమావేశాలకు హాజరవుతుంది. ఇంకా ఏం చేస్తే పిల్లల ప్రొగ్రెస్ బాగుంటుందో టీచర్లను అడిగితెలుసుకుంటుంది’’ అని శ్రీకాంత్ చెబుతుంటే ‘‘భవిష్యత్తు అంతా వారిదే కదండి. పేరెంట్స్‌గా మనం చేయగలిగిందాంట్లో ఏ లోపమూ ఉండకూడదన్నదే నా ఆలోచన’’ అన్నారు ఊహ. సినిమా సినిమా... గతంలో మీ శ్రీమతి నటించిన సినిమాలు ఎప్పుడైనా చూడాల్సి వస్తే ఇబ్బంది పడతారా అన్న ప్రశ్నకు ‘‘ఈవిడ చేసిన సినిమాలు తక్కువే. అందులో మేం ఇద్దరం కలిసి చేసిన సినిమాలే ఎక్కువ’’ అని నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు శ్రీకాంత్. శ్రీవారి నటన గురించి శ్రీమతిని అడిగినప్పుడు- ‘‘బాగా యాక్ట్ చేస్తేనే మెచ్చుకుంటాను. లేదంటే మౌనమే. సలహాలు ఇవ్వను’’ అన్నారు ఊహ. హీరోయిన్లతో దగ్గరగా నటించాల్సి వచ్చే సందర్భాలలో ఇన్‌సెక్యూర్ ఉండదా అన్న ప్రశ్నకు- ‘‘మావారు లేడీస్‌ని చాలా గౌరవిస్తారు. వారిని ముందే ‘ఏమ్మా!’ అంటూ సంబోధిస్తారు. అందుకే ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్లు కూడా ఈయన్ని బ్రదర్‌లాగా చూస్తారు’’ అంటూ కూల్‌గా జవాబిచ్చారు ఊహ. డబ్బు విషయాల గురించి అడిగినప్పుడు ‘‘ఇంటి మెయింటనెన్స్ వరకే నేను చూసుకుంటాను. పొదుపులు, రాబడులు, ఖర్చుల్లో నా జోక్యం ఉండదు’’ అని ఊహ అంటుంటే ‘‘తనకు తెలియకుండా ఏమీ ఉండదండి. అన్నీ ఏదో సందర్భంలో చెప్పేస్తుంటాను. భార్యకు ఆర్థిక లావాదేవీల గురించి చెప్పడం మంచిదని నా ఆలోచన’’ అన్నారు శ్రీకాంత్. సరదా సరదాగా... ఊహ పూర్తిగా శాకాహారి. కాని తన శ్రీవారికి రుచుల వడ్డన కోసం మాంసాహారాన్ని అద్భుతంగా వండటం నేర్చుకున్నారట. షూటింగ్స్ అయినా సరే ఇంటినుంచి క్యారేజ్ వెళ్లాల్సిందే! ఇక శ్రీవారి వంట సంగతి అడిగితే.. ‘‘ఛాన్సే లేదు. పొయ్యి దగ్గరకే వెళ్లనివ్వను. నేను ఉండగా అంత శ్రమ ఎందుకు’’ ఊహ అలా అనగానే ‘‘ఫ్రెండ్స్‌తో వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం వంట చేస్తాను. అప్పుడు ఈవిడకే ఫోన్ చేసి ఏవి ఎంత మోతాదులో వేయాలో అడుగుతుంటాను’’ అని శ్రీకాంత్ చెబుతుంటే ‘‘ఈయన పప్పుచారు, గుడ్డు, చికెన్ వంటలు బాగా చేస్తారట. కాని నేనెప్పుడూ టేస్ట్ చేయలేదు’’ అన్నారు ఊహ. అద్భుతమైన కానుక గురించి తెలపమన్నప్పుడు... ‘‘సిగరెట్ మానేయడం’’ అంటూ చటుక్కున చెప్పారు ఊహ. ‘‘ప్రామిస్ మాత్రం చేయలేదు’’ గుర్తు చేశారు శ్రీకాంత్. ‘‘అది మాత్రం నిజం. యాక్టింగ్‌లో తప్పదు. అప్పటి నుంచి సిగరెట్ తాగడం మళ్లీ మొదలు. ఈ సారి మాత్రం చాన్నాళ్లుగా సిగరెట్‌ను ముట్టుకోలేదు. మళ్లీ ఆ అలవాటు ఎంటర్ కాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాను’’ అన్నారు ఊహ. ఏ భర్త అయినా తన ఇల్లాలు ఇంటిపట్టునే ఉండాలనుకుంటాడు. శ్రీకాంత్ మాత్రం ఓ మెట్టు పెకైదిగి భార్య స్వతంత్రంగా ఎదగాలనుకున్నారు. తన కెరియర్‌ని కొనసాగించుకోమని ప్రోత్సహించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే! ఏ గృహిణి అయినా తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలనుకుంటుంది. ఊహ మాత్రం తన కెరియర్, స్నేహితులు, హై సొసైటీలో ఉండే రకరకాల కార్యక్రమాలన్నింటినీ దూరం పెట్టారు. ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామలే తన ప్రపంచం అనుకున్నారు. పదహారేళ్ల వారి వైవాహిక జీవితాన్ని తరచి చూస్తే మరో మెట్టు పెకైదిగిన ఊహ బెటర్‌హాఫ్ అని అనిపించకమానదు. | |||
No comments:
Post a Comment