చిన్న పిల్లలకు, ఎదిగే వారికి ఎలాంటి వారికైనా పాలు చాలా ఆరోగ్యకరం అని డాక్టర్ చెప్తారు. ఇది మనకందరికి తెలుసిన విషయమే. పాలలో చాలా విటమిన్లు, పోషకాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా ఒక గ్లాసు పాలు తాగించాలని చెప్తారు. ఇవన్నీ నిజమే కానీ పాలు కూడా కల్తీగా తయారవుతూ ఉంటే అప్పుడు ఆరోగ్యం కోసమే పాలు తాగుతున్న వారి ఆరోగ్యం ఏం కావాలి. చిన్నపిల్లల దగ్గరనుండి పెద్దల వరకు రోజూ పాలు తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మరి ఆ గ్లాస్ పాలే ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మారిస్తే పరిస్థితి ఏంటి ? పాల వల్ల అనారోగ్యమేంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ! అవునండీ.. మన ప్రపంచం అంతా దాదాపు కల్తీతోనే సాగుతుంది కదా! ఇప్పుడు ఆ కల్తీ పాలకు అంటుకుంది. దేశంలో 68 శాతం పాలు కల్తీయేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.
హానికారక పదార్థాలతో పాలను యథేచ్చగా కల్తీ చేస్తున్నారని.. దీన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ.. స్వామి అచ్యుతానంద లోగడ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కేంద్రంలో కదలిక వచ్చింది. కేంద్రం తరపున ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కమల్ కుమార్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఇందులో 2011లో తమ సంస్థ దేశవ్యాప్తంగా పాల నాణ్యతపై నిర్వహించిన సర్వే ఫలితాలను పేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల(గ్రామాలు, పట్టణాలు) నుంచి 1791 పాల నమూనాలను సేకరించి పరీక్షించారు. వీటిలో కేవలం 565 నమూనాలే ప్రమాణాల ప్రకారం ఉన్నాయి. మిగతా 1,226 ప్రమాణ రహితంగానే ఉన్నట్లు తేలింది. ఈ కల్తీ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 88శాతం పాలు కల్తీమయం అని రుజువైంది. సబ్బు ద్రావకం, నీరు, గ్లూకోజ్, పాలపొడి ఇలా పలు రకాల పదార్థాలను కూడా వర్తకులు పాల కల్తీ కోసం వినియోగిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. కల్తీకి వినియోగించేది కలుషిత జలమైతే తాగేవారి ఆరోగ్యం గుల్లేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇక పాలలో కలిపే సబ్బుద్రావకం వల్ల అవి తాగడానికి సురక్షితం కాదని.. పాకెట్ పాలను వాడుకోవడం ఒకింత మంచిదని సూచించింది
సాధారణంగా పాకెట్ పాలలో ఏం కలిపి ప్యాక్ చేస్తారో తెలియదని చాలా మంది విడిగా పోసే పాలే నయమని అనుకుంటూ ఉన్నారు. కాని ఆ విడి పాలే మన కొంపలు ముంచుతోంది. పాల సేకరణ అపరిశుభ్ర ప్రాంతాలలో జరుగుతుందనీ.. దూర ప్రాంతాలకు తరలించడం వల్ల పాల నాణ్యత తగ్గిపోవడమే కాకుండా.. పాడైపోయే ప్రమాదముంటుందని పాల నిపుణులు చెప్తున్నారు.
మొత్తం పాల కల్తీ.. గ్రామీణ ప్రాంతాల్లో 31శాతంగా ఉంటే.. పట్టణాల్లో అది 69శాతంగా ఉంది. ముఖ్యంగా, కల్తీలో విడిపాలదే అగ్రస్థానంగా ఉంది. వర్తకులు ఇంటి ఇంటికీ తిరిగి పోసే పాలల్లో 66శాతం కల్తీవే. అదే సమయంలో 33శాతం ప్యాకెట్ పాలు కల్తీకి గురవుతున్నాయి. స్కిమ్డ్, టోన్డ్, డబుల్ టోన్డ్ అంటూ రకరకాల పాలకోసం కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలు.. ఆచరణలో అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. మరి విడిగా పాలు పోయించుకునే వాళ్లు కాసింత జాగ్రత్తలు పాటించండి..

No comments:
Post a Comment