1. ఐస్ క్రీమ్, కేకుల తయారీల్లో క్రీం వాడకం ఎక్కువగానే ఉంటుంది. క్రీం వల్ల చేయబోయే పదార్థానికి మంచి రుచి రావాలంటే...దాన్ని గిలక్కొట్టే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.
2. క్రీమ్ మాత్రమే కాదు..దాన్ని ఉంచే బౌల్ కూడా ఎంత చల్లగా ఉంటే అంత మంచిది. అలాగే క్రీంను గిలక్కొట్టే ముందు చిటికెడు ఉప్ప చేర్చితే...పని సులువవుతుంది.
3. ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు సగం తయారయ్యాక పంచదార, వెనిల్లా వంటివి చేర్చాలి. అంతే కాని ముందుగానే క్రీమ్ ను వేయకూడదు.
4. కొన్ని సార్లు శెనగపిండితో చేసే లడ్డూలు ఎంత జాగ్రత్తగా చుట్టినా ఉండకట్టదు. లేదా అనుకొన్నంత రుచి ఉండదు. ఈ సమస్యల్ని తగ్గించాలంటే..పిండి కమ్మని వాసన వచ్చేవరకే వేయించాలి తప్ప ఎక్కువ సమయం ఉంచకూడదు. ఎక్కువగా వేయించినా లడ్డు చుట్టడం కష్టమవుతుంది.
5. శెనగపిండిలో ఒక వేళ పంచదార కలపకుండా ఉన్నట్లతే..దాన్ని సరిపడా చేర్చి ఆ మిశ్రమాన్ని సన్ననిమంటపై ఉంచాలి.
6. ఆ వేడికి పంచదార కరిగి కొద్దిగా తడిగా మారుతుంది. అప్పుడు దింపేస్తే చాలు. సులువుగా ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా పాలు వేడిచేసి మిశ్రమంలో అరచెంచా చొప్పున వేస్తూ లడ్డులు మృదువుగా వత్తుకోవచ్చు.
7. కాసేపు వేడినీళ్ళల్లో ముంచిన కత్తిని వాడితే డ్రైఫ్రూట్స్‌ను సులభంగా కట్ చేయవచ్చు.
8. నెయ్యి ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే నెయ్యి ఉంచిన గిన్నెలో ఒక చిన్న బెల్లం ముక్క వుంచండి.
9. బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.
10. గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.

No comments:
Post a Comment