all

Wednesday, November 21, 2012

డెలివరీ తర్వాత బ్రెస్ట్ కేర్ తో తల్లి బిడ్డ క్షేమం...

ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.
బ్రెస్ట్‌ సమస్యల్లో అక్యూర్డ్‌ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్‌ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే రిట్రాచ్‌ నిప్పల్‌, క్రాక్‌ నిప్పల్‌ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. కొందరు మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది. ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్‌ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్‌ ఉంటుంది. బిపి ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్‌ సమస్యలు ఏర్పడతాయి. పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్‌ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.
బ్రెస్ట్ వాపు ఉన్నప్పుడు మాయిస్ట్ హీట్ ను పపయోగించడం వల్ల నొప్పి నివారించవచ్చు. శిశువుకు తరచూ పాలు పట్టడం వల్ల కూడా నొప్పి తగ్గవచ్చు. డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అనేది సాధరణ సమస్యగా తీసుకొని, ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం తల్లి బిడ్డకు క్షేమం. నిప్పల్స్ సలపడం, నొప్పిగా ఉన్నప్పుడు శిశువు పాలు పట్టడం కరెక్ట్ గా ఉండాలి. శిశువు పాలు పట్టిన ప్రతి సారీ పాలు పట్టడానికి ముందు తర్వాత బ్రెస్ట్ ను శుభ్రం చేసుకోవాలి.
బ్రెస్ట్ బాగా గాలి ఆడేలా వదులైనటువంటి బ్లౌజులను వేసుకోవడం మంచి పద్దతి. దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. స్థనాలు శుభ్రపరచుకోవడానికి ఆల్కహాల్ వంటి ఉత్పత్తులు, రసాయనిక సోప్స్, సెంట్ కలిగిన క్లీనర్స్ తో ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగించడం వల్ల నిప్పల్స్ పొడి బారీ , క్రాకర్స్ ఏర్పడం జరుగుతుంది. డెలివరీ తర్వాత కరెక్ట్ సైజు కలిగినటువంటి బ్రాను ధరించడం చాలా ముఖ్యం. బ్రా టైట్ గా ఉన్నట్లైతే స్థనాలు అదిమి పెట్టబడి బరువుగా ఉండి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బ్రాలను  కొనేటప్పుడే సైజును ఎంపిక చేసుకోవాలి. అవి కూడా కాటన్ తో తయారు చేసినవైతే మంరి సౌకర్యంగా ఉంటాయి.

No comments: