all

Wednesday, November 21, 2012

ఇంటిని శుభ్ర పరచడం ఎలా..ఎక్కడ నుండి మొదలు పెట్టాలి..?

ఇల్లు, వాకిలి పరిశుభ్రంగా ఉండాలని, చూపరులను ఇట్టే ఆకట్టుకోవాలని, ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అందుకోసం సమయంతో నిమిత్తంలేకుండా శ్రమిస్తుంది. అయితే శుభ్రం చేయడంలో కొన్ని చిట్కాలను పాటిస్తే పని సులభం అవుతుంది. అదేలాంగే సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి. ఎక్కడకు పూర్తి చేయాలి అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోవాలి. తర్వాత పని మొదలు పెట్టాలి.
how clean the house where start cleaing

శుభ్రం చేయడం గది కప్పుతో మొదలు పెట్టాలి. తర్వాత గోడలు, తలుపులు, కిటీకీల తలుపులు, చువ్వలు, గదిలోని దీపాలు, ఆ తర్వాత అలమరాలు, ఫర్నిచర్‌ , చివరిగా ఫ్లోరింగ్‌ శుభ్రం చేయాలి. కదిలించేందుకు వీలు లేని వాటిమీద దుమ్ముపడ కుండా గుడ్డ కప్పి వుంచాలి. సామాన్లు సర్దాలనుకున్నప్పుడు ఒక్కొక్క అల్మారాలోవే తీయండి. అన్ని అరల్లోంచి ఒకేసారి సామానంత తీసి చుట్టూ పరుచుకోవద్దు. ముందుగా పై అర నుంచి సర్దుకుంటూ రావాలి.
అల్మారాలు సర్దేటప్పుడు మూలల్లో కలరా వుండలు వుంచండి. పాత ఉత్తరాలు, బ్యాంకు రసీదులు ఇంకా మీ అడ్రసు వున్న కవర్లు, విజిటింగ్‌ కార్డుల వంటివి పనికి రావనుకుంటే దాచకుండా చించి పడేయండి. అవసరమనుకున్న న్యూస్‌ పేపర్లు, కవర్లు, బ్యాగులు వుంచుకొని మిగతావి తీసేయండి .ముఖ్యంగా మిల్క్‌ కవర్లు దాచవచ్చు. వీటి వల బొద్దింకలు చేరే అవకాశం ఉంది. పాతబూట్లు, చెప్పులు, విరిగిన బొమ్మలు చిరిగిన పాత వస్తువులు, చిల్లు పడిన బిందెలు, హ్యాండిల్స్‌ విరిగిన కాఫీ బకెట్స్‌, మగ్గులు పిల్లలకి వాడిన పాలసీసాలు ఇంట్లో వుంచు కోవద్దు.
ఇల్లు మురికిలేకుండా, ఆరోగ్యకరంగా, నీట్‌గా ఉండాలనుకోవడం సహజం. వాతావరణ కాలుష్యం ఇంట్లో దుమ్మూ, ధూళి ఎక్కువగా చేరుతోంది. దీన్ని నిర్లక్ష్యంచేస్తే ఆరోగ్యానికే ముప్పు జరగవచ్చు. అందుకు బజార్లో దొరికే క్లీనింగ్‌ ఏజెంట్లపై ఆధారపడటం సహజం. కానీ వాటిని మంచి వాసన, చూడచక్కగా ఉంటాయని కొనడం సరికాదు. వాసన కాదు, ఆరోగ్యం ముఖ్యం. రసాయనాలను దూరంగా ఉంచడం ముఖ్యం.
రసాయనాలు నిండిన క్లీనర్స్‌ దీర్ఘకాలంలో చాలా హాని చేస్తాయి. ఊపిరితిత్తులు, కేన్సర్‌, కళ్లు మండటం, శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా, చర్మవ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు... ఇంకా కనిపించని ఎన్నో నష్టాలు రసాయనిక ఉత్పత్తుల ద్వారా వస్తాయి. వీటిలో ఉండే క్లోరిన్‌, బ్లీచ్‌, అమ్మోనియా వంటివి విషాలకిందే లెక్క. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రసాయనాలకు బదులు ఇంట్లో వస్తువులతోనే ఇంటిని అందంగా శుభ్రపరుచుకోచ్చు.
వెనిగార్‌: ఇంటి శుభ్రతకు అన్నివిధాలా ఉపయోగపడుతుంది. వెనిగార్‌ ను నీటితో సమపాళ్లలో కలిపి ఒక స్ప్రే బాటిల్‌ లో వేస్తే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనిగార్‌ వాసన ఆరగానే మాయమైపోతుంది. మురికి, గ్రీజు మరకలు, మరీ జిడ్డు మరక అయినప్పుడు వెనిగార్‌ను నీటిని కలపకుండా వాడాలి. దీన్ని ఉపయోగించి కిటికీలు, మైక్రోవేవ్‌ వంటివన్నీ శుభ్రపరచొచ్చు. కాకుంటే పిల్లలకు అందకుండా జాగ్రత్త పరచాలి. ఇంకా చెక్క ఫర్నిచర్‌ను దీనితో శుభ్రపరచకూడదు.
బేకింగ్‌ సోడా: బేకింగ్‌సోడాను వెనిగార్‌తో కలిపి గిన్నెలు శుభ్రపరచొచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. గిన్నెలు కడిగే డిటర్జెంట్లు అనేకమందికి ఇన్ఫెక్షన్లు, ఎలర్జీ సమస్యలకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. దీనికి నిమ్మకాయ కలిపి వాడితే జిడ్డు ఇట్టే మాయమైపోతుంది.
ఆలివ్‌ ఆయిల్‌: చెక్క ఫర్నిచర్‌ పై పట్టిన మురికిని శుభ్రపరచడానికి దీన్ని మించిన చిట్కా మరోటి లేదు.
నిమ్మకాయ: దీన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నివిధాలా మనకు ఉపయోగపడే చూడచక్కని చిన్ని నేస్తం. బ్యాక్టీరియాను పారద్రోలడంలో దీన్ని మించింది లేదు. తుప్పు పట్టినచోట కొద్దిగా నిమ్మరసం, ఉప్పు జల్లి తుడిస్తే చాలు. మొండి మరకలు, జిడ్డు తొలగించడానికి నిమ్మరసంతో శుభ్రపరిస్తే క్షణాల్లో నీట్‌ గా అయిపోతుంది. అలాగే ఫ్రిజ్‌ లోపలి వాసనకు అరచెక్క నిమ్మచెక్కను ఉంచితే సరిపోతుంది. ఫ్రిజ్‌లో ఆవరించిన చెడు వాసనపోతుంది.
ఉప్పు: తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగపడే వస్తువు. చీమలు ఎక్కువగా కనిపించేచోట ఉప్పు జల్లితే సరి. చెడు వాసన ఉన్నచోట, నీళ్లు పోకుండా బ్లాక్‌ అయిన చోట ఉప్పు, వేడినీరు కలిపి వేస్తే వాసన పోతుంది. గిన్నెల మరకలకు ఉప్పుతో రుద్దితే ప్రయోజనం ఉంటుంది. వీటి ఖరీదు తక్కువ. ఏమవుతుందోనని భయపడే పనిలేదు. రసాయనాలకు దూరంగా ఉండొచ్చు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య రక్షణ రెండూ నెరవేరతాయి. మరి ఇంట్లో చెప్పుకోదగ్గ మార్పు అదీ ఆరోగ్యకరమైన మార్పును తీసుకురండి.
 

 

No comments: